మూర్తిగారు అలా..వర్మ- పూరి ఇంకొంతమంది ఇలా!
వివాహ వ్యవస్థపై ఎవరి అభిప్రాయం వారిది. ఒకప్పుడు వివాహం అనేది అంతా తప్పని సరిగా భావించే వారు. కానీ నేడు పరిస్థితులు అలా లేవు.;
వివాహ వ్యవస్థపై ఎవరి అభిప్రాయం వారిది. ఒకప్పుడు వివాహం అనేది అంతా తప్పని సరిగా భావించే వారు. కానీ నేడు పరిస్థితులు అలా లేవు. సమాజంలో పెళ్లి చేసుకోని వారి సంఖ్య కూడా గణణీయంగా పెరుగుతుంది. ఫ్యామిలీ లైఫ్ కంటే సోలో లైఫ్ బెటర్ అన్న సెక్షన్ ఒకటైతే? ఫ్యామిలీ లైఫ్ లేకపోతే జీవితమే లేదన్నది మరో సెక్షన్. తాజాగా వివాహం గురించి విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి మాటల్ని ఓ సారి గుర్తు చేసుకుంటే సరి. నారాయణమూర్తి కూడా పెళ్లి చేసుకోలేదు.
ఎన్నో విప్లవ చిత్రాలతో సమాజాన్ని చైతన్య పరిచిన డైరెక్టర్ ఆయన. అలాంటి మూర్తిగారు పెళ్లి చేసుకో పోవడం ఏంటి? అనే సందేహం వస్తుంది. కానీ ఆయన ఇప్పటికీ సింగిల్. కానీ తనలో మాత్రం యువతను సింగిల్ లైఫ్ కి అలవాటు పడవద్దు అంటున్నారు. పెళ్లి...కుటుంబ జీవితం ప్రతీ ఒక్కరికి ఉండాలన్నారు. వివాహం అన్నది సృష్టి ధర్మంగా పేర్కొన్నారు. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదని...ప్రతీ జీవి.. .జీవ రాశికి కూడా ఆడమగ అనే బంధం ద్వారానే కొత్త తరానికి నాంది పలుకుతుందన్నారు.
పెళ్లి చేసుకోవడం విషయంలో తాను ఆలస్యంగా రియలైజ్ అయ్యానని..కానీ ఇప్పుడున్న యువత అలా కాకూడదన్నారు. మూర్తి గారు పెళ్లి చేసుకోలేదు...సింగిల్ గా ఉంటున్నారు? ఆయనలా ఉండాలని కొంత మంది యువత మాట్లాడుకోవడం వింటున్నాను. కానీ అది తప్పు..అలాంటి ఆలోచన మనసులోకి రాని వ్వొద్దన్నారు. ఇదే పరిశ్రమ నుంచి రాంగోపాల్ వర్మ, పూరిజగన్నాధ్ లాంటి వారు ఏం చెబుతన్నారంటే? జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జోలికి వెళ్లొద్దంటున్నారు. పెళ్లి చేసుకున్న వాళ్లని తెలివి తక్కువ మను షులుగా చెబుతున్నారు.
జీవితానికి పెళ్లి అవసరం లేదని...సింగిల్ గా ఉండటమే అసలైన జీవితంగా పేర్కొన్నారు. భూమ్మీదకు వచ్చినప్పుడు సింగిల్ గానే వచ్చామని...పోయేటప్పుడు కూడా అలాగే పోతామన్నారు. భూమ్మీద ఉన్నంత కాలం జీవితాన్ని సోలోగానే ఆస్వాదించాలంటున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం రకరకాల మార్గాలు న్నాయన్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే? రామ్ గోపాల్ వర్మ-పూరి జగన్నాధ్ ఇద్దరు పెళ్లి చేసుకున్న వారే. వర్మ భార్యతో విడిపోయి దూరంగా ఉన్నా? పూరి మాత్రం కలిసి ఉండే ఇలాంటి నీతి సూక్తులు సమాజంలో వదులుతున్నారు. వీళ్లిద్దరి లాంటి వారు ఇంకా ఇండస్ట్రీలో మరికొంత మంది ఉన్నారు.