గ్లామర్ తో కట్టిపడేస్తున్న మానుషి చిల్లర్!
మానుషి చిల్లర్..ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా తెలియకపోయినప్పటికీ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ హీరోయిన్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది.;
మానుషి చిల్లర్..ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా తెలియకపోయినప్పటికీ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ హీరోయిన్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది. మానుషి చిల్లర్ తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ తన అందాలతో ఎంతోమందిని ఆకట్టుకుంది. అయితే అలాంటి ఈ బ్యూటీ తాజాగా ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో మెరిసింది. తాజాగా బాలీవుడ్ హంగామా అవార్డ్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ అవార్డ్స్ ఈవెంట్ కి ఎంతోమంది తారలు పాల్గొని ఈవెంట్ ని సక్సెస్ చేశారు.
ఎంతోమంది సెలెబ్రిటీలకు బాలీవుడ్ హంగామా అవార్డ్స్ వరించాయి. అలా ఈ అవార్డ్స్ ఈవెంట్ లో మానుషి చిల్లర్ తన అందంతో అందరిని కట్టిపడేసింది.. మానుషి చిల్లర్ బాలీవుడ్ హంగామా అవార్డ్స్ ఈవెంట్ లో చాలా స్టైలిష్ గా కనిపించడంతోపాటు తాను వేసుకునే డ్రెస్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మానుషి చిల్లర్ వేసుకున్న డ్రెస్ తో ఆమె అందం మరింత పెరిగింది. ముత్యాలు,చంకీలు, రత్నాలు పొదిగిన డ్రెస్ లా ఉండే ఈ డ్రెస్ లో మానుషి చిల్లర్ తళుక్కున మెరుస్తోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఇలాంటి డ్రెస్ లో ఏ సెలబ్రిటీ కనిపించకపోయేసరికి అవార్డ్స్ ఈవెంట్ కి హాజరైన అందరి చూపు మానుషి చిల్లర్ డ్రెస్ మీదే పడింది. దీంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ అవార్డ్స్ ఫంక్షన్లో వైరల్ గా మారింది.
మానుషి చిల్లర్ ఆ ఫోటోలను కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫొటోస్ వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు మానుషి చిల్లర్ అందాన్ని కామెంట్ రూపంలో పొగుడుతున్నారు. ఈ డ్రెస్ కి హైలైట్ అయ్యేలా మెడలో చిన్న డైమండ్ నెక్లెస్ లాంటిది పెట్టుకొని లుక్ ని మరింత హైలెట్ చేసింది. ప్రస్తుతం మానుషి చిల్లర్ కి సంబంధించిన ఈ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అలాగే ఈ ఫోటోలకి "ఆఫ్టర్ హవర్స్ విత్ బాలీవుడ్ హంగామా" అనే కాప్షన్ కూడా పెట్టింది.
ఇంస్టాగ్రామ్ ఫోటోలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న మానుషి చిల్లర్ సినిమాలు , పర్సనల్ లైఫ్ విషయాలు చూసుకుంటే.. మానుషి చిల్లర్ సినిమాల్లోకి రాకముందే మిస్ వరల్డ్ గా కిరీటాన్ని అందుకుంది. అలా హర్యానాలో పుట్టి పెరిగిన మానుషి చిల్లర్ 2017లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో భారతదేశం తరఫున పాల్గొని మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది.
ఇండియా నుండి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న 6వ యువతిగా మానుషి చిల్లర్ మంచి గుర్తింపు సంపాదించింది. అలా మిస్ వరల్డ్ అయ్యాక సినిమాల్లో ఆఫర్లు ఎక్కువగా వచ్చాయి. అలా బాలీవుడ్ లో సామ్రాట్ పృథ్వీరాజ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే హిందీ సినిమాతో పాటు తెలుగులో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో మెరిసింది.ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మానుషి అందాలకు చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. ఆ తర్వాత బడే మియాన్ చోటే మియాన్ సినిమాలో కూడా నటించింది. అయితే చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మానుషి చిల్లర్ కి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..అలా అవకాశాలు తక్కువగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.