పేరు మార్పుపై ఆ భార్యాభ‌ర్త‌లేమంటున్నారంటే?

ఆ పేరుతో ఇండ‌స్ట్రీలో క‌లిసిరాలేదని..పేరు మార్చుకుంటే కొత్త అవ‌కాశాలు వ‌స్తాయ‌నో? బిజీ ఆర్టిస్ట్ అవుతామ‌నో కార‌ణంగా చాలా మంది మార్చుకుంటారు.

Update: 2024-05-22 23:30 GMT

సినిమా ఇండ‌స్ట్రీకొచ్చాక చాలా మంది పేర్లు మారుతుంటాయి. కొంత మంది కావాల‌ని మార్చుకుంటారు. మ‌రికొంత మంది పాత్ర‌ల‌తో వ‌చ్చిన గుర్తింపు కార‌ణంగా అదే పేరుతో కొన‌సాగుతుంటారు. అయితే ఎక్కువ‌గా కావాల‌ని మార్చు కునే వారు చాలా మంది ఉంటారు. ఆ పేరుతో ఇండ‌స్ట్రీలో క‌లిసిరాలేదని..పేరు మార్చుకుంటే కొత్త అవ‌కాశాలు వ‌స్తాయ‌నో? బిజీ ఆర్టిస్ట్ అవుతామ‌నో కార‌ణంగా చాలా మంది మార్చుకుంటారు.

ఇది అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ స‌ర్వ సాధార‌ణంగా క‌నిపిస్తుంది. తాజాగా ఇలా పేరు మార్చుకునే కాన్సెప్ట్ గురించి బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ భాజ్ పాయ్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'పేరు మార్చుకోవడం నాకెప్పుడూ నచ్చలేదు. సినిమాల్లోకి వచ్చాక కూడా చాలా కాలం క్రితం పేరు మార్చుకోవాలని అనుకున్నాను. చాలా మంది మనోజ్ అనే పేరు చాలా సాధార‌ణంగా ఉంది అనేవారు. నాకు మార్చుకుమందామా? అని మ‌న‌సు లాగింది.

కానీ సొంత పేరును మార్చుకోవ‌డం ఎందుక‌ని నాలో నేను రియ‌లైజ్ అయ్యాను. అప్పుడే నా సొంత‌ పేరునే నాపాత్ర‌కు పెడితే ఎలా ఉంటుంద‌ని ఆలోచించా ఓ సినిమాలో పాత్ర‌కి పెట్టి స‌క్సెస్ అయ్యాను. అప్ప‌టి నుంచే మ‌నోజ్ అనేది ఓ బ్రాండ్ గా మారింది' అని అన్నారు. అలాగే మ‌నోజ్ బాజ్ పాయ్ భార్య షబానా బాజ్‌పేయి కూడా పేరు మార్పు అంశంపై స్పందించారు. 'విధు వినోద్ చోప్రా నాకు పెట్టిన పేరు నేహా.

అంతా ఆపేరుతోనే ప్రేమ‌గా పిలుస్తారు. ఈ పేరు సినిమాలోనిది. కరీబ్‌లో నా స్క్రీన్ క్యారెక్టర్ పేరు నేహా కాబట్టి ఆయ‌న‌లా పిలిచేవారు. నేహాని నేహాగా పరిచయం చేస్తూ సినిమాని హైప్ చేస్తుంది. అప్పుడు నాకుఇలాంటివేవి పెద్ద‌గా తెలియ‌దు. నా చుట్టూ ఉన్న పెద్దలు తీసుకున్న నిర్ణయం ఆ పేరు. నేను ఆ పేరుతో కంప‌ర్ట్ గానే ఉన్నాను అనిపించింది. ఇంకే విష‌యాలు ప‌ట్టించుకోలేదు. నేను వీధిలో నడుస్తుంటే ఎవరైనా నేహా అని పిలిస్తే నేను తిరుగుతాను` అని అన్నారు.

Tags:    

Similar News