నేచురల్ స్టార్ డ్రీమ్ నెరవేరుతోందా?
ఇండియన్ సినీ హిస్టరీలో తమ కంటూ ప్రత్యేకతను చాటుకున్న స్టార్ డైరెక్టర్లు ఎందరో ఉన్నారు. వారిలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంది ప్రత్యేక శైలి.;
ఇండియన్ సినీ హిస్టరీలో తమ కంటూ ప్రత్యేకతను చాటుకున్న స్టార్ డైరెక్టర్లు ఎందరో ఉన్నారు. వారిలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంది ప్రత్యేక శైలి. తనదైన మార్కు సినిమాలని తెరపై అందంగా ఆవిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి. `పల్లవి అనుపల్లవి` నుంచి నిన్నటి థగ్ లైఫ్ వరకు తన మార్కు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అయితే రీసెంట్‌గా విడుదలైన `థగ్ లైఫ్` మణిరత్నం మార్కు సక్సెస్‌ని మాత్రం అందుకోలేకపోయింది.
దీంతో ఆలోచనలో పడ్డ మణిరత్నం పదేళ్ల క్రితం అనుసరించిన ఫార్ములానే ఫాలో కాబోతున్నాడట. పదేళ్ల క్రితం వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొన్న ఈ లెజెండరీ డైరెక్టర్ తనకు బాగా కలిసి వచ్చిన రొమాంటిక్ డ్రామాని నమ్ముకుని `ఓకే బంగారం` పేరుతో లవ్ స్టోరీని తెరకెక్కించి హిట్టు కొట్టాడు. మళ్లీ ట్రాక్‌లోకొచ్చాడు. సరిగ్గా ఇప్పుడు అదే పంథాని అనుసరించి తదుపరి మూవీని రొమాంటిక్ లవ్ స్టోరీగా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడట. రెగ్యులర్ రొమాంటిక్ మూవీస్‌కి భిన్నంగా మణిసార్ ఈ సారి కాప్ లవ్ స్టోరీని తెరపైకి తీసుకురాబోతున్నాడు.
ఇప్పటికే పట్టాలెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. కారణం స్టోరీకి తగ్గ కాస్టింగ్ కుదరకపోవడమేనట. గత ఆరు నెలలుగా మంచి కాస్టింగ్ కోసం మణిరత్నం అన్వేషిస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం విక్రమ్ తనయుడు దృవ్‌ని, లేటెస్ట్ సెన్సేషన్ రుక్మిణి వాసంత్‌ని ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మరో ప్రచారం ఏంటంటే వాళ్లు సెట్టవ్వకపోతే ఈ ప్రాజెక్ట్‌ని విజయ్ సేతుపతి, సాయి పల్లవితో తీసే ఆలోచన కూడా మణిరత్నం చేస్తున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి.
అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించే అవకాశం ఉందని, ఈ సినిమాతో మళ్లీ నాని కోలీవుడ్ వైపు అడుగులు వేయబోతున్నాడని మరో టాక్. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో సినిమా చేయాలని నాని డ్రీమ్. ఆ డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాకుండా మణిరత్నం ఈ ప్రాజెక్ట్ కోసం నానిని ఫైనల్ చేశారని, వచ్చే మార్చి నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.
నాని గతంలో మణిరత్నం డైరెక్ట్ చేసిన `ఓకే బంగారం` మూవీ కోసం దుల్కర్ సల్మాన్‌కు డబ్బింగ్ చెప్పడం తెలిసిందే. అప్పుడే తన డ్రీమ్‌ని బయటపెట్టిన నాని ఇన్నాళ్లకు ఆ డ్రీమ్‌ని నెరవేర్చుకోబోతున్నాడని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే మణిరత్నం అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.