స్టార్ హీరో కొడుకుతో మ‌ణిర‌త్నం ల‌వ్ స్టోరీ

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌ణిర‌త్నం త‌న త‌ర్వాతి సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో విక్ర‌మ్ కొడుకు ధృవ్ విక్ర‌మ్ తో చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.;

Update: 2025-08-04 09:30 GMT

ఎన్నో క్లాసిక్ సినిమాలను సినీ ఇండ‌స్ట్రీకి అందించిన లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం మొన్నీమ‌ధ్యే క‌మ‌ల్ హాస‌న్ హీరోగా థ‌గ్ లైఫ్ అనే సినిమాను చేసిన విష‌యం తెలిసిందే. నాయ‌గ‌న్ త‌ర్వాత మ‌రోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుండ‌టంతో థ‌గ్ లైఫ్ పై రిలీజ్ కు ముందు భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. కానీ రిలీజ్ త‌ర్వాత థ‌గ్ లైఫ్ దారుణ‌మైన ఫ్లాపుగా నిలిచింది.

ధృవ్ విక్ర‌మ్ తో మ‌ణిర‌త్నం సినిమా

థ‌గ్ లైఫ్ త‌ర్వాత మ‌ణిరత్నం ఎవ‌రితో సినిమా చేస్తారా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో ప‌లువురి పేర్లు వార్త‌ల్లో వినిపించాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌ణిర‌త్నం త‌న త‌ర్వాతి సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో విక్ర‌మ్ కొడుకు ధృవ్ విక్ర‌మ్ తో చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఓ పోలీస్ అధికారికి, సిటీ అమ్మాయికి మ‌ధ్య జ‌రిగే ల‌వ్ స్టోరీగా మ‌ణిర‌త్నం ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం.

త‌మిళంలో మాత్ర‌మే..

చెన్నైలోని ఓ పోలీసాఫీస‌ర్ చుట్టూ తిరిగే క‌థ‌తో పాటూ ఓ బ్యూటిఫుల్ ల‌వ్‌స్టోరీని మ‌ణిర‌త్నం ఈ సినిమాలో చూపించ‌నున్నార‌ట‌. అంతేకాదు, ఈ సారి మ‌ణిర‌త్నం ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా త‌మిళంలో మాత్ర‌మే చేస్తున్నార‌ట‌. సినిమా రిలీజ‌య్యాక తెలుగు, హిందీ భాషల్లో సినిమాను డ‌బ్బింగ్ చేసేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

కేవ‌లం 60 రోజుల్లోనే..

ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబ‌ర్ లో మొద‌లై కేవ‌లం 60 రోజుల్లో, 2026 ఫిబ్ర‌వ‌రి నాటికి సినిమాను పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. రుక్మిణి వ‌సంత్ హీరోయిన్ గా న‌టించ‌నున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించ‌నుండ‌గా, ర‌వి కె. చంద్ర‌న్ కు సినిమాటోగ్ర‌ఫీ బాధ్యత‌ల్ని అప్ప‌గించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News