రిసార్ట్ లో దివి వీడియోలు.. ఆమె ఏం చెప్పిందంటే?

తెలంగాణలోని చేవెళ్ల రిసార్ట్ లో జరిగిన ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.;

Update: 2025-06-13 10:18 GMT

తెలంగాణలోని చేవెళ్ల రిసార్ట్ లో జరిగిన ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. పోలీసులు ఆకస్మిక రైడ్స్ చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. మంగ్లీ, రిసార్ట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో రిసార్ట్ లోని బాత్రూమ్ లో దాక్కోవడంతోపాటు పరిగెత్తుతున్న నటి దివి వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో ఆమె క్లారిటీ ఇచ్చారు.

"ఏ తప్పు జరగకపోయినప్పుడు డోర్ ఎందుకు వేసుకున్నారు.. నడుచుకుని ఎందుకు వెళ్లిపోయారు.. ఎందుకలా చేశారు" అని హోస్ట్ అడగ్గా దివి స్పందించారు. "పోలీసులు రాగానే వీడియో ఆన్ చేసుకుంటూ వచ్చారు. మంగ్లీ అరిచిన వీడియో బాగా వైరల్ అయింది. వాళ్లను వీడియో ఆపమన్నా తప్పే అవుతుంది" అని దివి తెలిపారు.

"వాళ్లతో మాట్లాడినా తప్పే అవుతుంది. బర్త్ డే విషెస్ చెప్పేందుకు వెళ్ళిన మాపై కెమెరా పెట్టారు. అప్పుడే నాకు బాత్రూమ్ సేఫ్ అనిపించింది. ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నా. మంగ్లీ క్లోజ్ ఫ్రెండ్ అని పార్టీకి వెళ్లా. ఎవరో సడెన్ గా వచ్చేసి.. వీడియో తీశారు. ఎవరో వస్తారని చెప్పగా రూమ్ లోకి వెళ్లిపోయా. ఏం జరిగిందో అర్థం కాలేదు" అని తెలిపారు.

"అదే హైలెట్ చేశారు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎందుకు వచ్చారు? ఎవరు వచ్చారు? ఏమైంది? ఎందుకులా చేస్తున్నారు? నాకు ఐడియా రాలేదు. వీడియోలో కనిపించకూడదని దాక్కున్నా. అనవసరంగా ఫుటేజ్ ఇవ్వకూడదు. అదే నా మైండ్ లో ఉంది. మేడమ్ ఆగండి అంటే అంతా బ్యాడ్ అనుకుంటారు" అని చెప్పారు.

"డోర్ కొడుతుంది ఎస్ ఐ అని నాకు తెలియదు. నేను లోపల కూర్చున్నా. ఎవరో వచ్చి డోర్ కొట్టారని అనుకున్నా. అప్పుడే డోర్ తీసి వచ్చా. అరటి పండు తిన్నా పన్ను విరిగిన్నట్లు అయింది నా పరిస్థితి. నైట్ 10.15కి స్టార్ట్ అయ్యా. అన్నయ్య డ్రాప్ అవ్వగా.. నేను నా ఫ్రెండ్ తో కలిసి వెళ్లా. కేక్ కట్ అయ్యాక అదంత జరిగింది" అని చెప్పారు.

"మంగ్లీ ఫ్యామిలీ మెంబర్స్ తోపాటు చాలా తక్కువ మంది అక్కడ ఉన్నారు. బయట వాళ్లు తక్కువే ఉన్నారు. హంగామా కూడా లేదు. ఫుడ్ నేను తినలేదు. సడెన్ గా వాళ్లు వచ్చారు. ఏ తప్పు చేయని వాళ్లను హైలెట్ చేశారు. తప్పు చేయలేదన్నా ఫోటో వేస్తున్నారు. చాలా బాధగా అనిపించింది నాకు" అని పేర్కొన్నారు దివి.

"ఏ తప్పు కూడా చేయలేదు. వీడియో తీసి.. పెట్టి కామెంట్ చేస్తారని అనుకోలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళే టార్గెట్ అవుతారు. ఆయనెవడికో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఒక ఫ్యామిలీతో పార్టీ చేసుకుంటే ఇది అన్ ఫైర్. పాపం... నేను వెళ్లి ఇరుక్కుపోయా. మదర్ చాలా ఫీలయ్యారు. ఎంతో ఏడ్చారు. వాళ్లు రాకపోవడం పనికొచ్చింది" అని చెప్పారు.

"ఇండస్ట్రీలో బ్యాడ్ ఎక్కువగా హైలెట్ అవుతుంది. ఇండస్ట్రీ వాళ్లంటే బ్యాడ్ అంటారు. నేను ఎంత మాట్లాడినా ప్రయోజనం ఉంటుందో లేదో తెలియదు. ఎప్పుడూ తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడలేక బాత్రూంలో కూర్చున్నా అంతే. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా పానిక్ అవుతారు. డ్రామాలు నాకొద్దు" అని పేర్కొన్నారు.

"హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి వచ్చా. ఏవో రోల్స్ వస్తున్నాయి. మంచి ఆఫర్స్ రావట్లేదు. అందుకు ఇంకా కష్టపడుతున్నా. బర్త్ డేకి వెళ్తే ముందే అక్కడ ఏముందో తెలియదు. దారిలో వెళ్తే ఎవరో వచ్చి గుద్దిన సిట్యుటేషన్ నాది. ఏ తప్పని చేయని వాళ్లు బ్లేమ్ అవుతున్నారు. అందరూ నన్ను అర్థం చేసుకోండి" అని దివి కోరారు.

Tags:    

Similar News