కన్నప్ప న్యూ ట్రెండ్.. . ‘శ్రీకాళహస్తి’లో విష్ణు కుమార్తెల స్పెషల్ సాంగ్

ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవస్సీ స్వరాలు సమకూర్చారు. ఈ పాట వినగానే భక్తి, శ్రద్ధ, భావోద్వేగాలు అలుముకుంటాయి.;

Update: 2025-05-28 16:48 GMT

మంచు విష్ణు మంచు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారీ మైథలాజికల్ మూవీ ‘కన్నప్ప’ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాతో తన కలను సాకారం చేసుకుంటున్న విష్ణు, ప్రమోషన్ విషయంలోనూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఇటీవల అమెరికాలో ప్రత్యేక టూర్ చేసి అక్కడి ప్రేక్షకులకు ‘కన్నప్ప’ విశిష్టతను వివరించిన విష్ణు, ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు.

మే 28న కాశీ విశ్వనాథ ఆలయంలో ‘కన్నప్ప’ చిత్రం నుంచి వచ్చిన స్పెషల్ సాంగ్ ‘శ్రీ కాళ హస్తి’ను ఆవిష్కరించారు. ఈ పాటను విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత మోహన్ బాబు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, రచయితలు తోట ప్రసాద్, ఆకుల శివ, అర్పిత్ రాంకా తదితరులు పాల్గొన్నారు. కాశీలోని పవిత్ర ఆలయంలో ఈ పాటను విడుదల చేయడం వల్లే దానికొక ప్రత్యేకత వచ్చిందనే చెప్పాలి.

ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్ దేవస్సీ స్వరాలు సమకూర్చారు. ఈ పాట వినగానే భక్తి, శ్రద్ధ, భావోద్వేగాలు అలుముకుంటాయి. ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ సాహిత్యం శ్రీ కాళహస్తి దేవాలయం యొక్క పౌరాణిక, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని ఎంతో అందంగా వివరించింది. ఈ పాట కేవలం ఒక లిరికల్ సాంగ్ కాదు, ఓ ఆధ్యాత్మిక అనుభూతి అని అభిమానులు అంటున్నారు.

అరియానా, వివియానా ఆలపన మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి స్వరాల్లో వచ్చే పవిత్రత, అమాయకత పాటకు మరింత బలం చేకూర్చింది. చిన్నవయసులోనే ఇలా ఓ మైథలాజికల్ మూవీ కోసం గానం చేయడం అరుదైన అవకాశం. పాట చిత్రీకరణలోనూ చాలా శ్రద్ధ పెట్టారు. అందమైన విజువల్స్‌తో కూడిన లిరికల్ వీడియో అందర్నీ ఆకట్టుకునేలా ఉంది.

ఈ పాటను కాశీలో విడుదల చేయడమవల్ల భక్తులంతా దీన్ని ఆధ్యాత్మిక పంథాలో స్వీకరిస్తున్నారు. ‘శ్రీ కాళ హస్తి’ ఆలయ విశిష్టతను ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ పాట రూపొందించారని సినిమా బృందం పేర్కొంది. ఇలా సినిమాకు సంబంధించి ప్రతీ ప్రమోషన్ యాక్టివిటీని ఒక ఆధ్యాత్మిక ఉత్సవంగా మార్చుతున్న విష్ణు మంచు ఎక్కడైనా పాజిటివ్ వైబ్స్ సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ‘కన్నప్ప’ చిత్రానికి సంగీతంగా, విజువల్‌గా, ఆధ్యాత్మికంగా ఓ కొత్త కోణాన్ని చూపించే ఈ పాట, భవిష్యత్ తరాలకు శ్రీ కాళ హస్తి ఆలయం విశిష్టతను గుర్తు చేస్తూ నిలిచిపోతుందని విశ్వసిస్తున్నారు.

Full View
Tags:    

Similar News