• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మనోజ్ డేవిడ్ రెడ్డి...

మనోజ్ డేవిడ్ రెడ్డి సినిమాలో కనిపించనున్న ఇద్దరు స్టార్ హీరోలు...!

| పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న డేవిడ్ రెడ్డి సినిమా ఇప్పటికే దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడటానికి.. ప్రధాన కారణం ఈ సినిమా కాస్టింగ్ అప్‌డేట్స్.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2025-12-17 06:39 GMT

ఈ మధ్యనే మిరాయి చిత్రంతో.. తనేంటో మరోసారి రుజువు చేసుకున్నారు.. మంచు మనోజ్. దొంగ దొంగది సినిమాతో హీరోగా అడుగుపెట్టిన ఈ మంచు వారసుడు.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో.. నెగిటివ్ పాత్రలవైపు కూడా మగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే మిరాయి చిత్రంలో విలన్ గా కనిపించి ఆకట్టుకున్నారు.

ఇక ఈ సెకండ్ ఇన్నింగ్స్ లోనే.. హీరోగా డేవిడ్ రెడ్డి.. అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న డేవిడ్ రెడ్డి సినిమా ఇప్పటికే దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడటానికి.. ప్రధాన కారణం ఈ సినిమా కాస్టింగ్ అప్‌డేట్స్.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..ఈ చిత్రంలో కీలక అతిథి పాత్రల కోసం ఇద్దరు సూపర్ స్టార్స్ ని సంప్రదించారంట. టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఓ స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర కోసం అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పాత్రపై రామ్ చరణ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

మరోవైపు‌‌.. కోలీవుడ్ స్టార్ సింబు..ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మనోజ్ కి సింబు మంచి ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మనోజ్ అడగగానే ఈ హీరో ఒప్పుకున్నారు అని వినికిడి. ఇక ఈ ముగ్గురు హీరోలు కలిసి కనిపిస్తే ఈ సినిమాకి క్రేజ్ మరింత రెట్టింపు అవ్వడం ఖాయం.

ఇక ఈ సినిమాలో మనోజ్.. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యమైన తిరుగుబాటు వీరుడిగా కనిపిస్తారు అని తెలుస్తోంది. బ్రిటిష్ పాలకులపై పోరాటం చేసే పాత్ర ఇది అని కూడా సమాచారం.

ఈ సినిమా కథ 1897 నుంచి 1922 మధ్య కాలాన్ని నేపథ్యంగా తీసుకుని సాగుతుంది. ఆ కాలంలో జరిగిన పోరాటాలు, త్యాగాలు, భావోద్వేగాలు ఈ కథలో ప్రధానంగా ఉంటాయి. బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అన్యాయాలపై ఈ సినిమా కథ నడుస్తుందంట. ఈ చిత్రానికి హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. మోటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి.. ఈ సినిమాను వెల్వెట్ సౌల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన.. టైటిల్ పోస్టర్.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. మనోజ్ ముఖాకారంలో టైటిల్ డిజైన్ చేయడం అందరిని ఆకట్టుకుంది. “మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించి, ఢిల్లీలో పెరిగి, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేస్తున్నాడు” అనే ట్యాగ్‌లైన్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మరి ఈ సినిమా ఈ హీరోకి ఎలాంటి ఫలితం ఇస్తుందో.. వేచి చూడాలి.

Tags:    
  • davidreddy 
  • manchumanoj 
  • ramcharan 
  • silambarasantr 
  • tollywoodbuzz 
  • davidreddymovie 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS