మంచు మనోజ్ గురి కుదిరితే మాత్రం..?
మనోజ్ కూడా ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ నుంచి తనకు వస్తున్న ఈ రెస్పాన్స్ చూసి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని ఫిక్స్ అయ్యాడు.;
మంచు ఫ్యామిలీ హీరో మంచు మనోజ్ తిరిగి సినిమాల్లో బిజీ అవ్వడం అతని ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. కొన్నాళ్లుగా సినిమాలు చేయని మనోజ్ మళ్లీ తిరిగి సినిమాల్లోకి వస్తాడా లేదా అన్న డౌట్ కూడా కలిగేల చేశాడు. ఐతే భైరవం సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మంచు మనోజ్. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా ఆఫ్టర్ ఇయర్స్ మనోజ్ ని స్క్రీన్ మీద చూసి మంచు ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక నెక్స్ట్ మంచు మనోజ్ మిరాయ్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాడు.
ప్రతినాయకుడిగా మంచు మనోజ్..
తేజా సజ్జ లీడ్ రోల్ లో వస్తున్న మిరాయ్ లో ప్రతినాయకుడిగా మంచు మనోజ్ చేశాడు. సినిమాలో తేజ సజ్జ ఒక పాజిటివ్ పాయింట్ అయితే.. మంచు మనోజ్ విలన్ గా చేయడం మిరాయ్ కి స్పెషల్ క్రేజ్ తెచ్చింది. ఐతే భైరవం తో రీ ఎంట్రీ ఇచ్చిన మనోజ్ మిరాయ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మంచు మనోజ్ గురి కుదిరితే మాత్రం తాను అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టే లెక్క. మిరాయ్ ప్రమోషన్స్ లో మంచు మనోజ్ సందడి చూస్తున్న ఫ్యాన్స్ ఈ సినిమాతో అతని కంబ్యాక్ ఇస్తాడని ఆశిస్తున్నారు.
మనోజ్ కూడా ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ నుంచి తనకు వస్తున్న ఈ రెస్పాన్స్ చూసి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని ఫిక్స్ అయ్యాడు. మిరాయ్ అనుకున్న టార్గెట్ రీచ్ అయితే మాత్రం తేజా సజ్జ కి ఎలాగు మరో బ్లాక్ బస్టర్ పడుతుందేమో కానీ మంచు మనోజ్ కెరీర్ సరైన ట్రాక్ ఎక్కుతుంది. అందుకే ఆడియన్స్ కు తను ఎలాంటి పాత్రలు చేస్తున్నా అన్నది కాకుండా వారిని అలరించడానికి ఎలాంటి సినిమాలైనా చేసేలా మనోజ్ రెడీ అవుతున్నాడు. విలన్ గా అతను క్లిక్ ఐతే తప్పకుండా స్టార్ సినిమాల్లో కూడా ఢీ అంటే ఢీ అనేలా పాత్రలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఆడియన్స్ కు విజువల్ ట్రీట్..
మిరాయ్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు. సినిమాపై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తేజా సజ్జ, మంచు మనోజ్ ఇద్దరు కూడా బెస్ట్ ఇచ్చారట. సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ ఇస్తాయని అంటున్నారు. మంచు మనోజ్ కూడా మిరాయ్ రిజల్ట్ అనుకున్న విధంగా సక్సెస్ పడితే ఇక వరుస సినిమాలతో దూసుకెళ్లాలని చూస్తున్నాడు.
మంచు మనోజ్ ట్రాక్ ఎక్కితే మాత్రం మళ్లీ మంచు ఫ్యాన్స్ హంగామా మొదలైనట్టే లెక్క. ఈమధ్యనే మనోజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఓకే చేశాడని తెలుస్తుంది. దాని అనౌన్స్ మెంట్ త్వరలో ఉంటుందట.