• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమిళ హీరోకు తల నొప్పి...

తమిళ హీరోకు తల నొప్పి తెచ్చి పెట్టిన మంచు మనోజ్‌!!

| మంచు హీరో మనోజ్‌ దాదాపు దశాబ్ద కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2025-05-26 10:50 GMT

మంచు హీరో మనోజ్‌ దాదాపు దశాబ్ద కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన భైరవం సినిమాలో మంచు మనోజ్‌ ముఖ్య పాత్రలో నటించాడు. నారా రోహిత్‌ సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. సినిమాను మే 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ముగ్గురు హీరోలు తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సుదీర్ఘ కాలం బ్రేక్ తర్వాత మంచు మనోజ్‌ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అందరి దృష్టి ఆయనపై ఉంది. అందుకే ప్రమోషన్ సమయంలో ఆయనే ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటే సినిమాకు బజ్‌ క్రియేట్‌ అవుతుందని భావిస్తున్నారు.

సినిమాలో మంచు మనోజ్‌ పాత్ర ఏ మేరకు ఉంటుంది అన ఏ విషయంలో క్లారిటీ లేదు... కానీ ఆయన ప్రమోషన్‌లో బెల్లంకొండను డామినేట్‌ చేసి మరీ కనిపిస్తున్నారు అంటూ టాక్‌ వినిపిస్తుంది. ఏ పబ్లిసిటీ కార్యక్రమంలో అయినా మంచు మనోజ్‌ సందడి ఎక్కువగా ఉంటుంది. ముగ్గురు హీరోలు ఉన్నా అందులో మంచు మనోజ్‌ గోల కనిపిస్తూ ఉంది. తాజాగా భైరవం సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వైభవంగా జరిగింది. ఆ ఈవెంట్‌లోనూ మంచు మనోజ్ మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అంతే కాకుండా మనోజ్‌ సరదాగా తమిళ హీరో శింబుకు కాల్‌ చేసిన మాటలు, వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఆ సమయంలో శింబు ఫోన్ నెంబర్‌ను మంచు మనోజ్‌ లీక్ చేశాడు.

మొదట మనోజ్‌ తన ఫోన్‌ నుంచి శింబు కు కాల్‌ చేశాడు. శబ్దం సరిగా వినిపించక పోవడంతో పక్కనే ఉన్న హీరోయిన్‌ ఫోన్ తీసుకుని శింబు ఫోన్‌కి కాల్‌ చేశాడు. అప్పుడు ఫోన్‌ను కెమెరా వైపు తిప్పి ఉంచి మాట్లాడటంతో లైవ్‌లో నెంబర్‌ టెలికాస్ట్‌ అయింది. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఆ ఫోన్‌ నెంబర్‌ కనిపిస్తుంది. దాంతో నిమిషాల వ్యవధిలోనే శింబుకు ఫోన్ల మీద ఫోన్‌లు వచ్చాయట. మనోజ్ చేసిన పనితో శింబుకు వరుస కాల్స్ వచ్చి తలనొప్పి మొదలైందట. దాంతో శింబు కొంత సమయం ఫోన్ ఆఫ్‌ చేశారని కూడా తెలుస్తోంది. అదే సమయంలో నీ నెంబర్‌ లీక్‌ అయింది, నీ కోసం నేను కొత్త సిమ్ కార్డ్‌ను కొని పంపిస్తాను అని మనోజ్‌ సరదాగా అన్నాడు.

కమల్‌ హాసన్‌ సర్‌ సినిమా థగ్‌ లైఫ్‌ లో ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్న శింబుకు మనోజ్ శుభాకాంక్షలు తెలియజేశాడు. కమల్‌ సర్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకోవడం చూస్తే జెలస్‌గా అనిపిస్తుందని లైవ్‌లోనే థగ్‌ లైఫ్‌ సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి తన మంచి తనంను మంచు మనోజ్ చూపించాడు. మొత్తానికి భైరవం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జరిగిన ఈ సంఘటనతో శింబు ఫోన్‌ ఒక్కసారిగా బిజీ అయింది. శింబుకు తలనొప్పి కల్పించిన మంచు మనోజ్‌ నిజంగానే ఆయనకు కొత్త నెంబర్‌ ఇస్తాడా అనేది చూడాలి. శింబు నెంబర్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ ఫోన్‌ నెంబర్‌కి వేలాది మంది కాల్స్ చేస్తున్నారు. తమిళం వారికి కూడా శింబు నెంబర్‌ చేరడంతో మరింతగా ఆయనకు కాల్స్ ఎక్కువ అయ్యి ఉంటాయి.

Full View
Tags:    
  • ManchuManoj 
  • SilambarasanTR 
  • Simbu 
  • Bhairavam 
  • FilmEventMishap 
  • ViralMoment 
  • SumaKanakala 
  • CelebrityBlunder 
  • TollywoodNews 
  • KollywoodBuzz 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS