మ‌నోజ్ కు ఇదే క‌రెక్ట్ టైమ్

మోహ‌న్ బాబు ఫ్యామిలీలో ఉన్న గొడ‌వ‌ల గురించి అంద‌రికీ తెలిసిందే. ఏ ఇంట్లో అయినా గొడ‌వ‌లు స‌హ‌జం.;

Update: 2025-11-05 03:00 GMT

మోహ‌న్ బాబు ఫ్యామిలీలో ఉన్న గొడ‌వ‌ల గురించి అంద‌రికీ తెలిసిందే. ఏ ఇంట్లో అయినా గొడ‌వ‌లు స‌హ‌జం. అంద‌రి ఇళ్ల‌ల్లో గొడ‌వ‌లు జ‌రుగుతాయి. కాక‌పోతే అవి నాలుగు గోడ‌ల మ‌ధ్య‌నే ఉండిపోతాయి. కానీ మంచు వారింట వివాదం మాత్రం అంద‌రికీ తెలిసేలా జ‌రిగింది. మంచు అన్న‌ద‌మ్ములు విష్ణు, మ‌నోజ్ మ‌ధ్య ఆస్తి త‌గాదాల కార‌ణంగా ఆ కుటుంబం చాలా కాలం పాటూ వార్త‌ల్లోకెక్కింది .

గొడ‌వ‌ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని మ‌నోజ్ ప్ర‌యత్నాలు

ఈ గొడ‌వ‌ల్లో మ‌నోజ్ ఒంటరిగా పోరాటం చేస్తే, మోహ‌న్ బాబు మాత్రం విష్ణు ప‌క్క‌న ఉన్నారు. అయితే ఈ గొడ‌వ‌లు మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్ట‌డానికి మ‌నోజ్ ఎంతో కాలంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అంతా క‌లిసి కూర్చుని మాట్లాడుకుందామ‌ని మ‌నోజ్ చాలా సార్లు త‌న కుటుంబాన్ని కోరారు. ఎన్నో ఈవెంట్స్ లో త‌న అన్న విష్ణు, తండ్రి మోహ‌న్ బాబు గురించి చాలా గొప్ప‌గా మాట్లాడుతూను వ‌స్తున్నారు.

50 ఏళ్లు పూర్తి చేసుకున్న మోహ‌న్ బాబు

అయిన‌ప్ప‌టికీ మోహ‌న్ బాబు నుంచి కానీ, విష్ణు నుంచి కానీ ఈ విష‌యంలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక అస‌లు విష‌యానికొస్తే ఇప్పుడు మోహ‌న్ బాబు ఇండ‌స్ట్రీలో గోల్డెన్ జూబ్లీకి ద‌గ్గ‌రిగా ఉన్నారు. ఈ ఇయ‌ర్ తో ఆయ‌న ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 50 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. ఈ సంద‌ర్భంగా ఎంబీ50 పేరుతో న‌వంబ‌ర్ 22న గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వ‌హించాల‌ని విష్ణు ప్లాన్ చేస్తున్నారు.

ప‌లు ఇండ‌స్ట్రీల నుంచి రానున్న సెల‌బ్రిటీలు

ఈ వేడుక‌ల‌కు తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల‌కు చెందిన సెల‌బ్రిటీల‌ను ఆహ్వానించి, తండ్రికి గుర్తుండిపోయే మెమొరీస్ ను ఇవ్వాల‌ని విష్ణు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ప‌నుల‌న్నింటినీ కూడా స్వ‌యంగా విష్ణునే చూసుకుంటున్నార‌ట‌. మ‌రి ఇలాంటి స్పెష‌ల్ ఈవెంట్ కు మ‌నోజ్ ను విష్ణు ఆహ్వానిస్తారా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారగా, ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న గొడ‌వ‌లు స‌మ‌సిపోవ‌డానికి ఇదే మంచి స‌మ‌య‌మ‌ని, మ‌నోజ్ ఈ ఈవెంట్ లో పాల్గొంటే త‌ర్వాత అంతా నార్మ‌ల్ అవుతుంద‌ని భావిస్తూ నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్నారు.

Tags:    

Similar News