ఇదే లాస్టా? ఈ స్పీడేంటి అనిల్?
ఉగాదికి సినిమాను లాంచ్ చేసిన అనిల్, ఈ సినిమాను జెట్ స్పీడులో పరుగులు పెట్టిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేశారు అనిల్.;
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయమెరుగని డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు అనిల్ రావిపూడి. అందుకే ఆయన్ని అందరూ టాలీవుడ్ హిట్ మెషీన్ అని పిలుస్తుంటారు. అనిల్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన ప్రతీ సినిమా ఒకదాన్ని మించి మరొకటి హిట్టవగా, అతన్నుంచి ఆఖరిగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీజనల్ బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించింది.
అనిల్ ఫాస్ట్ తట్టుకోవడం కష్టమే!
తన ప్రతీ సినిమాతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించే అనిల్ రావిపూడి, సినిమా తీయడంలో చాలా ఫాస్ట్ గా ఉంటారు. పూరీ జగన్నాధ్ ఎలాగైతే త్వరగా సినిమాలను పూర్తి చేస్తారో, అనిల్ కూడా అంతే వేగంగా సినిమాలను పూర్తి చేస్తుంటారు. ప్రీ ప్రొడక్షన్ లోనే అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం వల్ల షూటింగ్ కు వెళ్లాక పెద్దగా టైమ్ తీసుకోకుండా చెప్పిన దానికంటే ముందే షూటింగ్ ను ఫినిష్ చేస్తారు అనిల్.
మెగాస్టార్ తో మన శంకరవరప్రసాద్ గారు
ఇక అసలు విషయానికొస్తే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఉగాదికి సినిమాను లాంచ్ చేసిన అనిల్, ఈ సినిమాను జెట్ స్పీడులో పరుగులు పెట్టిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేశారు అనిల్.
అక్టోబర్ 20 నుంచి జాయిన్ అవనున్న వెంకీ
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ అక్టోబర్ 6 నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. సినిమాలోని అన్ని షెడ్యూల్స్ లో ఇదే పెద్ద షెడ్యూల్ అని, ఇందులోనే చిరంజీవి, వెంకటేష్ పై సన్నివేశాలను కూడా తెరకెక్కించనున్నారని సమాచారం. అక్టోబర్ 20 నుంచి మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ లో వెంకటేష్ జాయిన్ కానున్నారని, ఈ షెడ్యూల్ తో ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుందని తెలుస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల ప్రోమోకు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రానుంది.