స్పిరిట్ మూవీలో మెగాస్టార్!

తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఒక సీనియర్ హీరోని తీసుకునే ఆలోచనలో సందీప్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.;

Update: 2025-09-21 22:30 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' సినిమా తర్వాత ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ హీరోగా తన సినిమాలతో రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రభాస్.. ఇప్పుడు ఏకంగా తన చేతిలో ఏకంగా 6 ప్రాజెక్టులు పెట్టుకున్నారు. అందులో భాగంగానే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'ది రాజా సాబ్'. ప్రభాస్ కెరియర్ లో రాబోతున్న తొలి హారర్ జానర్ మూవీ ఇది. ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఏడాది డిసెంబర్లో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. అలా 2025 జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'ఫౌజీ'. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ నటించిబోయే మరో చిత్రం 'స్పిరిట్'. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నారు. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇందులో నటిస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఒక సీనియర్ హీరోని తీసుకునే ఆలోచనలో సందీప్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు మెగాస్టార్ అని తెలియడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఇకపోతే మెగాస్టార్ అంటే అందరూ టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి అనుకుంటారు. కానీ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని ఇందులో తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ ఈ విషయం నిజమైతే మాత్రం సినిమా మరో రేంజ్ కి వెళ్తుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమా విషయానికొస్తే మొదట దీపికా పదుకొనేను హీరోయిన్ గా తీసుకొని ఆమెను తప్పించి, యానిమల్ తో సంచలనం సృష్టించిన త్రిప్తి డిమ్రిని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని టి - సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా ఈ సినిమాతో ఒక విభిన్నమైన కథను తెరపై చూపించడానికి సిద్ధమవుతున్నారు. మరి ప్రభాస్ కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి

Tags:    

Similar News