అందరినీ నెట్టేస్తూ ఏ-లిస్ట్ లోకి అందగత్తె
సౌత్ లో ఆమె దూసుకుని వస్తోంది. ఒక్కసారిగా తన డిమాండ్ ని పెంచుకునిపోతోంది. అంతే కాదు అందరినీ నెట్టేస్తూ ఏ లిస్ట్ లో చేరిపోతోంది. ఇంతకీ ఎవరా అందగత్తె అంటే ప్రేమలు ఫేం మమిత బైజు.;
సౌత్ లో ఆమె దూసుకుని వస్తోంది. ఒక్కసారిగా తన డిమాండ్ ని పెంచుకునిపోతోంది. అంతే కాదు అందరినీ నెట్టేస్తూ ఏ లిస్ట్ లో చేరిపోతోంది. ఇంతకీ ఎవరా అందగత్తె అంటే ప్రేమలు ఫేం మమిత బైజు. ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఆమె లైనప్ చూస్తూంటే దక్షిణాదిన టాప్ లెవెల్ లోకి ఎగబాకేలా ఉందని అంటున్నారు.
దక్షిణ భారతం నుంచి చూస్తే నేషనల్ క్రష్ రష్మిక మందన జాతీయ స్థాయిలో వెలుగుతోంది. అలాగె ఆమె అనేక భాషలలో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇక రష్మికతో పాటు శ్రీలీల కూడా వరస సినిమాలతో బిజీ అంటోంది. ఈ ఇద్దరే కాదు నేనూ ఫుల్ బిజీ అంటోంది మమిత బైజు.
ఆమె ప్రేమలు అన్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ద్వారా తానేంటో నిరూపించుకుంది. ఆ మూవీలో ఆమె చిలిపి నటన క్యూట్ గా చేసిన తీరు ఆమె ఉత్సాహం ఉల్లాసం అన్నీ కలసి ఆమెకి లెక్కలేనన్ని ప్రశంసలు అందించాయి. అంతే ఆ ఒక్క మూవీ ఆమె ఏకంగా దక్షిణ భారత దేశంలోనే అత్యంత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతే కాదు ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది.
ప్రేమలు విజయం తరువాత ఆమెకు ఒకేసారి ఏకంగా ఎనిమిది సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి అంటే మమిత బైజు మహిమ చెప్పతరమా. ఈ క్యూటీ వరసగా చేస్తున్న సినిమాలు హీరోల లిస్ట్ చూస్తే అదిరిపోవాల్సిందే. ధనుష్, సూర్య, దళపతి విజయ్ వంటి అగ్రశ్రేణి నటులతో, ప్రదీప్ రంగనాథన్, సంగీత్ ప్రతాప్ వంటి యువ హీరోలతో వారి రాబోయే చిత్రాలలో స్క్రీన్‌ను పంచుకుంటోంది.
అంతే కాదు మాలీవుడ్ లో సైతం ఆమె జెండా ఎగరేస్తోంది. ఒక మలయాళ చిత్రంలో నివిన్ పౌలీ సరసన నటించడానికి కూడా ఆమె ఎంపికైంది. సూపర్ సక్సెస్ అయిన ప్రేమలు మూవీకి సీక్వెల్ కూడా త్వరలో కార్యరూపం దాల్చడానికి చర్చలు జరుగుతున్నాయి. అంటే మరోసారి ఆ మ్యాజిక్ ని మమిత బైజు. రిపీట్ చేస్తుంది అన్న మాట.
ఇవన్నీ చూస్తూంటే సౌత్ ఇండియాలో మమిత బైజు టాప్ హీరోయిన్ గా మారుతోంది అంటున్నారు. ఆమె చేసిన ఒకే ఒక్క మూవీ ప్రేమలుతో చాలా తొందరగా సులువుగా టాప్ గ్రేడ్ హీరోయిన్లను దాటుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. మమిత బైజు నక్కనూ లక్కునూ కలసి ఒకేసారి తొక్కి ఉంటుంది. అందుకే ఆమె దశ మామూలుగా లేదట.