ప్రేమ‌లు బ్యూటీ రేటు అద‌ర‌గొడుతుందిగా!

ఇప్పుడు డ్యూడ్ కోసం రూ.75 ల‌క్ష‌లు తీసుకుంటుంద‌ట‌. విజ‌య్ తో చేస్తున్న జ‌న‌నాయ‌గ‌న్ సినిమాకైతే ఏకంగా మ‌మిత రూ. 1 కోటి ఛార్జ్ చేస్తుంద‌ని స‌మాచారం.;

Update: 2025-05-15 02:30 GMT

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప్ర‌తీ వారం స్టార్లు మారుతూ ఉంటారు. ఒక వారం ఒక‌రు విజేత‌గా నిలిచి స్టార్ అయితే, మ‌రోవారం ఇంకొక‌రు స్టార్ అవుతాయి. అందుకే ఇండ‌స్ట్రీలో ఎవ‌రెప్పుడు క్లిక్ అవుతారో, ఎవ‌రికెప్పుడు ఎలాంటి స్టార్‌డ‌మ్ వ‌స్తుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. కొంత‌మంది ఎన్నేళ్లు క‌ష్ట‌ప‌డినా క్లిక్ అవ‌క‌పోతే, మ‌రికొంద‌రికి మాత్రం ఫేమ్ వ‌చ్చి రాత్రికి రాత్రే ఫేమ‌స్ అయిపోతుంటారు.

ప్రేమ‌లు సినిమాలో న‌టించిన మ‌మిత బైజు కు కూడా ఇలాంటి అదృష్ట‌మే ప‌ట్టుకుంది. ప్రేమ‌లు సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయిన మ‌మిత ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళంలో ప‌లు సినిమాల్లో న‌టిస్తోంది. వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తున్న అమ్మ‌డు, క్రేజ్ ఉన్న‌ప్పుడే క్యాష్ చేసుకోవాల‌నే ఆలోచ‌న‌తో త‌న రెమ్యూన‌రేష‌న్ ను కూడా బాగా పెంచింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

మ‌లయాళ ఇండ‌స్ట్రీలో ముందుగా ఎన్నో సినిమాల్లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన మ‌మిత‌కు ప్రేమ‌లు సినిమా మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ సినిమా వ‌ల్లే అమ్మ‌డికి ప‌లు భాష‌ల్లో అవ‌కాశాలొస్తున్నాయి. ప్ర‌స్తుతం మ‌మిత టాలీవుడ్ లోని అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న డ్యూడ్ సినిమాతో పాటూ ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తున్న జ‌న‌నాయ‌గ‌న్ లో కూడా న‌టిస్తోంది.

ఇంత‌కుముందు ఒక్కో సినిమాకు రూ. 50 ల‌క్ష‌లు లోపే ఛార్జ్ చేసిన మ‌మిత‌, ఇప్పుడు డ్యూడ్ కోసం రూ.75 ల‌క్ష‌లు తీసుకుంటుంద‌ట‌. విజ‌య్ తో చేస్తున్న జ‌న‌నాయ‌గ‌న్ సినిమాకైతే ఏకంగా మ‌మిత రూ. 1 కోటి ఛార్జ్ చేస్తుంద‌ని స‌మాచారం. ఈ రెండూ సినిమాలూ మంచి టాక్ తెచ్చుకుని హిట్ గా నిలిస్తే మ‌మిత క్రేజ్ మ‌రింత పెర‌గడం ఖాయం. అప్పుడు ఈ రెమ్యూన‌రేషన్ ను మ‌మిత ఇంకా పెంచే అవ‌కాశాలున్నాయి.

Tags:    

Similar News