ప్రభాస్‌ను చూడగానే మొత్తం పోయింది : మాళవిక

ఇంకా మాళవిక మోహన్‌ మాట్లాడుతూ... రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ మొదటి రోజు చాలా స్పెషల్‌. ఆ రోజును ఎప్పటికీ మరచిపోను.;

Update: 2025-06-19 04:29 GMT
ప్రభాస్‌ను చూడగానే మొత్తం పోయింది : మాళవిక

ప్రభాస్‌కి పాన్ ఇండియా రేంజ్‌లో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్‌ అమాంతం పెరిగింది. ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ప్రభాస్‌పై అభిమానం కనబర్చుతూ ఉంటారు. ప్రభాస్‌ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు, చేస్తున్న సినిమాల కారణంగా ఆయనపై అభిమానం మరింతగా పెరుగుతుంది. హీరోయిన్స్ ఒక్క సినిమాలో అయినా ప్రభాస్‌తో నటించాలని కలలు కంటున్నారు. ఆ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. ప్రభాస్ ప్రస్తుతం 'రాజాసాబ్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించారు. అందులో ప్రధానంగా నిధి అగర్వాల్‌, మాళవిక మోహన్‌ కనిపించారు. టీజర్‌లో మాళవిక మోహనన్‌ పాత్ర ఆసక్తికరంగా ఉంది.

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం అయినప్పటికీ మాళవిక కొన్ని కారణాల వల్ల టాలీవుడ్‌ సినిమాల్లో నటించలేదు. అప్పట్లో ఒకటి రెండు చిన్నా చితకా ఆఫర్లు వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఎట్టకేలకు మాళవిక టాలీవుడ్‌లో 'రాజాసాబ్‌' సినిమాతో ఎంట్రీకి సిద్ధం అయింది. మొదటి సినిమాలోనే ప్రభాస్‌కు జోడీగా నటించడంతో టాలీవుడ్‌లో ఈ అమ్మడి ఫ్యూచర్‌ చాలా బ్రైట్‌గా ఉండబోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో మాళవిక మోహనన్‌ కి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఒక చిట్‌ చాట్‌లో ప్రభాస్‌తో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది.

రాజాసాబ్‌ సినిమా కోసం దాదాపు మూడు ఏళ్లుగా ఈ అమ్మడు ఎదురు చూస్తుంది. మొదట్లో సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయినప్పటికీ కండీషన్స్ కారణంగా చెప్పుకోలేదు. ఇప్పటికీ రాజాసాబ్‌లో తన పాత్ర గురించి బయటకు చెప్పకూడదని మారుతి కండీషన్ పెట్టినట్లు ఉన్నాడు. అందుకే సినిమా గురించి అడిగిన సమయంలో అద్భుతంగా ఉంటుంది అని తప్ప పెద్దగా స్పందించడం లేదు. తాజా చిట్‌ చాట్‌లో ప్రభాస్‌ను మొదటి సారి చూసిన సమయంలో తాను పొందిన అనుభూతిని గురించి చెప్పుకొచ్చింది. ప్రభాస్‌పై తనకు ఉన్న అభిమానం ఏంటి అనేది ఆమె మాటల్లో అర్థం అవుతుంది. మాళవిక మోహనన్‌ మొదటి రోజు షూటింగ్‌ సమయంలో ప్రభాస్‌ను అలాగే చూస్తూ ఉండి పోయిందట.

ఇంకా మాళవిక మోహన్‌ మాట్లాడుతూ... రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ మొదటి రోజు చాలా స్పెషల్‌. ఆ రోజును ఎప్పటికీ మరచిపోను. ఆ సినిమా షూటింగ్‌కి ముందు తాను మరో షూటింగ్‌లో ఉన్నాను. వెంటనే షూటింగ్‌కు హాజరు కావాల్సి ఉండటంతో కనీసం విశ్రాంతి తీసుకోకుండా, కనీసం నిద్ర కూడా లేకుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. చాలా అలసటతో రాజాసాబ్‌ సెట్స్‌లో మొదటి రోజు అడుగు పెట్టాను. అప్పటికే అక్కడ ఉన్న ప్రభాస్‌ను చూడగానే నా అలసట మొత్తం పోయింది. ఆయనతో మాట్లాడటం తో ఎక్కడ లేని ఉత్సాహం నాలో కలిగింది. ఆయనతో కలిసి వర్క్ చేయడంను ఎప్పటికీ మరచిపోలేను.

తప్పకుండా రాజాసాబ్ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా ఉంటుంది. ప్రభాస్‌తో నా సన్నివేశాలు వినోదాత్మకంగా ఉంటాయని మాళవిక మోహనన్‌ చెప్పుకొచ్చింది. డిసెంబర్‌లో విడుదల కాబోతున్న రాజాసాబ్‌ టీజర్ తాజాగా వచ్చింది. సంజయ్ దత్‌ ముఖ్య పాత్రలో కనిపించిన ఈ సినిమాలో ప్రభాస్‌ పాత్ర బుచ్చిగాడిని తలపిస్తుందనే విశ్వాసంను మేకర్స్‌తో పాటు, ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News