అతని ప్రవర్తనతో చాలా భయపడ్డా!
ప్రతీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొన్ని నియమాలుంటాయని, అవి అన్ని చోట్లా ఒకేలా ఉండవని ప్రముఖ నటి మాళవికా మోహనన్ తెలిపింది.;
ప్రతీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొన్ని నియమాలుంటాయని, అవి అన్ని చోట్లా ఒకేలా ఉండవని ప్రముఖ నటి మాళవికా మోహనన్ తెలిపింది. సౌత్ లో కనిపించాలంటే హీరోయిన్ మరీ సన్నగా ఉండకూడదని, అలా ఉంటే తప్పని శరీరాకృతి విషయంలో తాను ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నట్టు మాళవికా తెలిపింది. ఒకప్పుడు తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని మాళవిక వెల్లడించింది.
గతంలో తనపై వచ్చిన విమర్శలు తనను ఎంతగానో బాధించాయని చెప్తూ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని మాళవిక బయటపెట్టింది. ఒకరోజు రాత్రి తాను ఫ్రెండ్స్ తో కలిసి ముంబైలోని లోకల్ ట్రైన్ లో జర్నీ చేశానని, ఆ జర్నీ టైమ్ లో తనని ఒకతని ప్రవర్తన చాలా భయపెట్టిందని మాళవికా మోహనన్ తెలిపింది.
జర్నీ చేస్తున్న టైమ్ లో ఆ కంపార్ట్‌మెంట్‌లో తను, తన స్నేహితులు తప్ప ఎవరూ లేరని, ఆ టైమ్ లో ఒకతను తమ కంపార్ట్‌మెంట్ లోకి వచ్చేందుకు ట్రై చేశాడని, అక్కడున్న గ్లాస్ డోర్ నుంచి తొంగిచూస్తూ ముద్దిస్తావా అని సైగలు చేశాడని, అతని ప్రవర్తన తనను, తన ఫ్రెండ్స్ ను భయపడేలా చేసిందని, ఆ టైమ్ లో అసలేం చేయాలో అర్థం కాలేదని మాళవిక వెల్లడించింది.
అలా భయపడుతూ ఉండగా ట్రైన్ మరో స్టేషన్ కు వచ్చిందని, అక్కడ తమ కంపార్ట్‌మెంట్ లోకి మరికొంత మంది వచ్చాక తమ భయం మొత్తం పోయిందని మాళవిక తెలిపింది. ఇక హీరోయిన్ లుక్స్ విషయంలో కూడా మాళవిక మాట్లాడింది. కొంచెం బరువు పెరిగి నార్త్ లో సినిమా చేయాలనుకుంటే అక్కడ ఛాన్సులు రావని, నార్త్ సినిమా కోసం కొంచెం సన్నబడి తిరిగి సౌత్ కు వస్తే ఇక్కడ బొద్దుగా ఉంటేనే బావుంటావంటారని మాళవిక తనకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చింది.
దీంతో ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో కన్ఫ్యూజ్ అయ్యానని, తర్వాత మెల్లిగా సిట్యుయేషన్స్ అర్థమయ్యాయని ఏదేమైనా ఫిట్‌గా, హెల్తీగా ఉండాలని డిసైడ్ అయినట్టు అమ్మడు తెలిపింది. తన కెరీర్ స్టార్టింగ్ లో సన్నగా ఉన్నానని ఎంతోమంది ట్రోల్ చేశారని, ఆ తర్వాత కొంచెం లావు అయ్యేసరిగా అప్పుడు కూడా తనను విమర్శించారని చెప్పిన మాళవిక దక్షిణాది హీరోయిన్లు ఎక్కువగా బొడ్డు మీదనే ఫోకస్ చేస్తారని, సోషల్ మీడియాలో కూడా బొడ్డు కనిపించేలా దిగిన ఫోటోలనే షేర్ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది మాళవిక.