నటి ఆరోప‌ణ‌: క్రూయిజ్ షిప్‌లో వారిని ఆక‌ట్టుకోవాల‌న్నారు..!

ఓసారి తాను షూటింగ్ కోఆర్డినేటర్‌ను కలవడానికి వెళ్లినప్పుడు తన రేటు కార్డు గురించి చెప్పినట్లు వెల్లడించింది.

Update: 2024-05-23 17:30 GMT

మీటూ ఉద్య‌మంలో చాలామంది తార‌లు లైంగిక వేధింపుల గురించి ఓపెన‌య్యారు. ఇందులో ప్ర‌ముఖ క‌థానాయిక‌లు కూడా ఉన్నారు. ఏదో ఒక స‌మ‌యంలో తాము అలాంటి వేధింపుల‌ను ఎదుర్కొన్నామ‌ని వెల్ల‌డించారు. ఇప్పుడు ప్ర‌ముఖ టీవీ న‌టి లైంగిక వేధింపుల గురించి ఓపెన‌య్యారు. అనేక పాపులర్ షోలలో పనిచేసిన అహి విజ్ ఇటీవల భయానకమైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఈమె జై భానుషాలి భార్య. ఓసారి తాను షూటింగ్ కోఆర్డినేటర్‌ను కలవడానికి వెళ్లినప్పుడు తన రేటు కార్డు గురించి చెప్పినట్లు వెల్లడించింది. ఇది అహి విజ్ కెరీర్ తొలినాళ్ల‌లో జరిగింది.


తాజా ఇంటర్వ్యూలో మహి విజ్ త‌న భ‌యాన‌క అనుభవాన్ని గుర్తు చేసుకుంది. మహి ఢిల్లీకి చెందిన యువ‌తి. నటనలో తన వృత్తిని కొనసాగించడానికి 17 సంవత్సరాల వయస్సులో ముంబైకి మారింది. పాపం కెరీర్ ప్రారంభ రోజుల్లో కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. షూటింగ్ కోఆర్డినేటర్ అని చెప్పుకునే వ్యక్తి నుండి తనకు కాల్ వచ్చిందని మహి విజ్ చెప్పారు. ఆమె అతడిని కలవడానికి అంగీకరించింది. అతడి కారులో తన సోదరితో కలిసి జుహుకి వెళ్ళింది. ఆ వ్యక్తి తన రేట్ కార్డ్ గురించి ..క్రూయిజ్‌లో ఇతరులను ఎలా ఆకట్టుకోవాలి అనే దాని గురించి తెలియజేశాడు.

Read more!

అతడి మాటలు విన్న మహి ఒక్కసారిగా షాక్ అయింది. అక్కడ ఏదో తప్పు జరుగుతోందని గ్రహించింది. వారు వెనుక సీట్లో కూర్చున్నారు. మహి, త‌న‌ సోదరితో క‌లిసి వెంటనే అతడి జుట్టు పట్టుకుని గుంజి తప్పించుకోగలిగింది. మహీ విజ్ టీవీ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి. అకేలా, కైసీ లాగి లగన్, లాగీ తుజ్సే లగన్ మొదలైన షోలకు పనిచేశారు. 2011లో జే భానుశాలిని వివాహం చేసుకున్నారు. తారా అనే ఆడ శిశువుకు వీరు తల్లిదండ్రులు. వీరిద్దరూ 2017లో రాజ్‌వీర్ అనే అబ్బాయిని, ఖుషీ అనే అమ్మాయిని కూడా ద‌త్త‌త తీసుకుని పెంచుకుంటున్నారు.

Tags:    

Similar News