• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  SSMB29: లొకేషన్ల వేట...

SSMB29: లొకేషన్ల వేట పూర్తయ్యిందా జక్కన్నా?

| ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-07-26 14:30 GMT

సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ఓ భారీ ప్రాజెక్ట్‌ ను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా 'SSMB 29' అని ప్రచారం చేయబడుతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు? ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు? వంటి విషయాలు తెలుసుకోడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్, రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే రచయిత విజయద్ర ప్రసాద్ స్క్రిప్ట్ లాక్ చేసారని టాక్. మరోవైపు లొకేషన్స్ వేట కూడా పూర్తయిపోయిందని అంటున్నారు. ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే అడ్వెంచర్ యాక్షన్ మూవీ కావడంతో, దీనికి తగ్గట్టుగానే ఫారిన్ లొకేషన్స్, విదేశీ అడవుల్లో చిత్రీకరించనున్నారు. దీని కోసం దర్శకుడు ఇంతకముందెన్నడూ ఇండియన్ స్క్రీన్ మీద చూడని సరికొత్త లొకేషన్స్ ఎంచుకున్నట్లు సమాచారం.

వెండితెర మీద విజువల్ వండర్స్ ఆవిష్కరించడానికి కృషి చేసే రాజమౌళి.. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నారని విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. SSMB 29 మూవీ ద్వారా ప్రేక్షకులకు విజువల్‌గా అద్భుతమైన అనుభూతిని పంచే ప్రదేశాల్లో షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారట. 'ఇండియానా జోన్స్' తరహాలో ఉంటుందని దర్శకుడు ఇది వరకే హింట్ ఇచ్చారు కాబట్టి.. ఎక్కువ శాతం అటవీ నేపథ్యంలో ఉండే అవకాశం ఉంది.

రాజమౌళి ఆ మధ్య తన ఫ్యామిలీతో కలిసి నార్వేలోని పల్పిట్‌ రాక్స్ ను సందర్శించారు. అలానే మహేష్ బాబు జర్మనీలోని అతి పెద్దదైన బ్లాక్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేసారు. దీంతో ఆ రెండు లొకేషన్స్ లోనూ ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయనే మాట కూడా వినిపిస్తోంది. సినిమా నేపథ్యాన్ని బట్టి యాక్షన్ సన్నివేశాలకు, భారీ సాహసాలకు ఎక్కువ స్కోప్ వుంటుంది. దీనికి అనువైన ప్రదేశాలనే చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలను మాత్రం సెట్స్ లో తీయనున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

ఇది గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ మూవీ అని, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని జక్కన్న చెబుతూ వస్తున్నారు. మహేశ్ బాబు సైతం ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే చాలా కష్టపడుతున్నారు. జిమ్ లో హార్డ్ వర్కౌట్స్ చేసి బాడీ రెడీ చేసారు. పొడవాటి జుట్టు, గడ్డం మీసాలతో మునుపెన్నడూ చూడని లుక్ లో కనిపించబోతున్నారు. ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని దుర్గా ఆర్ట్స్ నిర్మాత కె.ఎల్‌. నారాయణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

Tags:    
  • Tollywod 
  • Filmindustry 
  • Gunturkaaram 
  • SSMB29 
  • Maheshbabu 
  • Rajamouli 
  • Shooting 
  • VijayadharaPrasad 
  • Germany 
  • BlackForest 
  • KLNarayana 
  • Durgaarts 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS