• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుంటూరు కారం.. త్వరలోనే ఓ...

గుంటూరు కారం.. త్వరలోనే ఓ సూపర్​ సర్​ప్రైజ్​

| సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం.

By - Tupaki Desk
Update: 2023-09-10 12:19 GMT

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. భారీ బడ్జెట్​తో కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్​గా ఈ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్​. అలానే ఈ చిత్రం మ్యూజికల్​గా చార్ట్ బస్టర్​ హిట్​ అయ్యేలా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిసింది. పర్ఫెక్ట్ కమర్షియల్ ఆల్బమ్​లా సిద్ధం చేస్తున్నారట.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. చాలా రోజుల నుంచి ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్​ను రిలీజ్ చేస్తారనే ప్రచారం సాగుతుంది తప్ప.. ఏ పాట బయటకు రావట్లేదు. కానీ ఇప్పుడు ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రంలో ఉన్న డ్యుయెట్ సాంగ్​ను విడుదల చేసేందుకు మేకర్స్​ రెడీ అయ్యారట. త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇదే పనిలో బిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. శ్రోతలను ఉర్రూతలూగించేలా సాంగ్​కు అద్భుతంగా బాణీలు కడుతున్నారుట. గతంలో అలవైకుంఠపురములో తమన్ బాణీలు అందించిన బుట్టబొమ్మ సాంగ్​ ఏ రేంజ్​లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. ఇప్పుడు గుంటూరు కారం కోసం కూడా ఆ రేంజ్​లో ఈ డ్యూయెట్​ సాంగ్​ను ట్యూన్ చేస్తున్నారట. ఈ పాట కచ్చితంగా చార్ట్ బస్టర్​ అవుతుందని ఇన్​సైడ్ నుంచి టాక్ వినిపిస్తోంది. ​

ఇకపోతే ఈ చిత్రంలో మొత్తంగా 4 నుంచి 5 పాటలు , రెండు థీమ్స్ సాంగ్స్​ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ఆ మధ్య సమాచారం అందింది. ఇందులోనే ఓ డ్యుయెట్​ సాంగ్ ఉంటుందని అన్నారు. కచ్చితంగా చిత్రంలో రెండు మెయిన్ సాంగ్స్, ఓ థీమ్ సాంగ్ అయితే ఉంటాయట. ఓ పాట.. మహేశ్ బాబు క్యారెక్టరైజేషన్​ను ఎలివేట్ చేస్తూ లిరిక్స్ రాసి అద్భుతమైన విజువల్స్​తో తెరకెక్కిస్తున్నారని కూడా అన్నారు. ఇక స్పెషల్ సాంగ్​ను.. విలేజ్ బ్యాక్ గ్రౌండ్​లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని కూడా టాక్ వినిపించింది. ఈ సాంగ్స్​ విషయంలో అంతా అనుకున్నట్లు జరిగితే మహేశ్ బాబుకు దూకుడు తర్వాత మరో పక్కా కమర్షియల్ హిట్ ఆల్బమ్ అవుతుందనే చెప్పాలి.

ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల- మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస ఈ మధ్యే సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ చిత్రంలో మహేశ్ మున్నపెన్నడూ కనిపించని సరికొత్త మాస్ లుక్​లో కనిపిస్తారని చిత్రబృందం చెబుతోంది.

Tags:    
  • Maheshbabu 
  • GunturkaramMovie 
  • Tollywood 
  • Movienews 

Similar News

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

Copyright @2026

Powered by Blink CMS