నాన్న కూచీ సితార స్పెష‌ల్ డే

సితార ఘట్టమనేని ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. భ‌విష్య‌త్‌లో టాలీవుడ్ ని ఏలే స‌త్తా ఉన్న‌ న‌ట‌వార‌సురాలు.;

Update: 2025-07-20 06:41 GMT

సితార ఘట్టమనేని ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. భ‌విష్య‌త్‌లో టాలీవుడ్ ని ఏలే స‌త్తా ఉన్న‌ న‌ట‌వార‌సురాలు. ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేష్ బాబు- న‌మ్ర‌త దంప‌తుల గారాల‌ప‌ట్టీ. సితార‌ చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రుల బాట‌లోనే కళలపై ఆస‌క్తిని క‌లిగి ఉంది. సితార అద్భుత‌మైన నృత్యం, అభిన‌యానికి సంబంధించిన ప్ర‌తి వీడియోను న‌మ్ర‌త ఇంత‌కుముందు సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసారు. త‌న తండ్రితో క‌లిసి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోను సితార న‌టించింది. ఘ‌ట్ట‌మ‌నేని న‌ట‌వార‌సురాలు సితార‌కు సోష‌ల్ మీడియాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు.

ఇక సితారను నాన్న కూచీ అంటే త‌ప్పేమీ కాదు. త‌న తండ్రితో సితార అనుబంధం అలాంటిది. ఈరోజు (20 జూలై) సితార పుట్టిన‌రోజు. నేటికి 12 ఏళ్లు. టీనేజీలో ఉన్న త‌న కుమార్తెకు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ‌ర్త్ డే విషెస్ చెబుతూ ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ని ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ``సితార‌ ఒక టీనేజర్! పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఎల్లప్పుడూ నా జీవితాన్ని లైట్నింగ్ చేస్తుంది. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను`` అంటూ ల‌వ్ హార్ట్ ఈమోజీల‌ను మ‌హేష్ షేర్ చేసారు. న‌మ్ర‌త కూడా సోష‌ల్ మీడియాల్లో కుమార్తె సితార‌కు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు.

సితార హైద‌రాబాద్ లోని ఒక కార్పొరెట్ స్కూల్ లో విద్యాభ్యాసం కొన‌సాగిస్తోంది. చిన్నప్పటి నుంచీ సితారకు నృత్యం, న‌ట‌న అంటే మ‌క్కువ ఉంది. కళలపై చాలా ఆసక్తిగా ఉంటుంది. తండ్రితో క‌లిసి మ్యాక్స్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో సితార క్యూట్ లుక్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అందువ‌ల్ల త‌ను స్టార్ అవుతుంద‌ని అభిమానులు ఊహిస్తున్నారు. అయితే సితార భ‌విష్య‌త్ విష‌యంలో త‌ల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండ‌దు. న‌టి అవ్వాల‌నే నియ‌మం కూడా ఏమీ లేదు. కొన్నిటికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.

Tags:    

Similar News