సితారతో మహేష్ క్యూట్ మూమెంట్!

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండటంతో అభిమానులు ఒక్కో చిన్న అప్‌డేట్‌కూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, మహేష్ బాబు ఇటీవల కుటుంబంతో కలిసి విదేశీ విహారానికి బయల్దేరారు.;

Update: 2025-07-21 11:25 GMT

ఎస్‌ఎస్‌ఎంబీ 29 సినిమాపై దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ గురించి అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక సినిమా ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో వస్తుండడంతో మహేష్ బాబు కెరీర్ లోనే ఇదొక బెస్ట్ టర్నింగ్ ప్రాజెక్ట్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండటంతో అభిమానులు ఒక్కో చిన్న అప్‌డేట్‌కూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, మహేష్ బాబు ఇటీవల కుటుంబంతో కలిసి విదేశీ విహారానికి బయల్దేరారు.

జూలై 20న తన కూతురు సితార 13వ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు కుటుంబం పూర్తి స్థాయిలో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు బయలుదేరింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ తన కూతురు సితారపై ముద్దుపెట్టుకున్న మధుర క్షణాలు కెమెరాకు చిక్కాయి. ఈ చిన్న మూమెంట్ ఎంతో ప్రేమతో ఉండడంతో నెటిజన్ల హృదయాలను తాకింది. అది కేవలం ఒక ఆప్యాయత మాత్రమే కాదు.. తన పాపతో ఉన్న బంధాన్ని, అభిమానం, భద్రతను చూపించే ఓ ఎమోషనల్ మూమెంట్‌.

మహేష్ బాబు హల్క్ గ్రీన్ టీషర్ట్‌, బ్లాక్ క్యాప్‌, స్టైలిష్ గ్లాసెస్‌తో కూల్‌గా కనిపించగా, సితార సింపుల్ ఫ్రాక్‌లో చిరునవ్వుతో నడుస్తూ తన నాన్న చేతిని పట్టుకుని ముందుకెళ్లడం అభిమానులను ఆహ్లాద పరిచింది. వారితో పాటు నమ్రతా శిరోద్కర్, గౌతమ్ కూడా కనిపించడంతో అది ఫుల్ ఫ్యామిలీ ట్రిప్ అనే విషయం స్పష్టమైంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, డాడీ డాటర్ గోల్స్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకుముందు మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పుట్టినరోజు సందర్భంగా భావోద్వేగంగా రాసుకొచ్చాడు “ఇప్పుడు ఆమె టీనేజ్ లోకి అడుగుపెట్టింది.. నా ప్రపంచాన్ని వెలుగులు నింపింది.” అంటూ ప్రేమగా ఓ పోస్ట్ చేశాడు. నమ్రత కూడా చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ, "నా ప్రపంచాన్ని మార్చిన చిన్నారి" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వీటి ద్వారా ఈ స్టార్ ఫ్యామిలీ ఎమోషనల్‌గా ఎలా కనెక్ట్ అవుతుందో మరోసారి రుజువైంది.

ఇదంతా చూస్తుంటే మహేష్ బాబు కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి ఇచ్చే ప్రాముఖ్యతే వేరుగా కనిపిస్తుంది. పిల్లల పట్ల అతడి ప్రేమ, కుటుంబానికి గల అంకితభావం స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఫ్యాన్స్‌ ఫోకస్ మాత్రం ఎస్ఎస్ఎంబీ29 పైనే. అయితే అప్పటివరకు సినిమాకు సంబంధించిన ఒక్క లుక్ కూడా రాలేదు. మరి సినిమా ఫస్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tags:    

Similar News