స‌మ్మ‌ర్ ఎఫెక్ట్‌కి జ‌క్క‌న్న ప్లాన్ మార్చాల్సిందేనా?

సమ్మర్ తీవ్రత పెరిగిన నేపథ్యంలో నగరాల్లో నీటి కొరత సమస్య మరింత తీవ్రమవుతోంది.;

Update: 2026-05-04 05:35 GMT

సమ్మర్ తీవ్రత పెరిగిన నేపథ్యంలో నగరాల్లో నీటి కొరత సమస్య మరింత తీవ్రమవుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు సినీ పరిశ్రమపై కూడా పడుతోందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు- రాజ‌మౌళ‌ఙ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి షూటింగ్‌కు సంబంధించి ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ స్థాయిలో నీటి అవసరం ఉండటంతో, దానికి అనుమతులు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ విష‌యంపై అఫీషియ‌ల్ గా ఎలాంటి క‌న్ఫ‌ర్మేష‌న్ లేకపోయినా, నీటి కొరత పరిస్థితుల మధ్య ఇలాంటి భారీ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై అధికారులు వెనుకడుగు వేసినట్టు ప్రచారం జరుగుతోంది.

అనుకున్న ప్ర‌కారం నీరు దొర‌క్కపోతే అది షూటింగ్ షెడ్యూల్ పై ప్రభావం చూపే అవకాశముండే అవ‌కాశ‌ముంది. ముఖ్యమైన అండర్‌వాటర్ ఎపిసోడ్ కోసం ప్లాన్ చేసిన షెడ్యూల్ వాయిదా పడితే, మొత్తం ప్రాజెక్ట్ టైమ్‌లైన్‌లో మార్పులు రావడం సహజం.

ఇప్పటికే భారీ బడ్జెట్, ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్న ఈ సినిమాకు చిన్న అడ్డంకి కూడా పెద్ద ప్రభావం చూపే అవ‌కాశ‌ముంద‌ని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రాజమౌళి తన పర్ఫెక్షన్ కోసం షూటింగ్ షెడ్యూల్స్‌ను చాలా క‌ఠినంగా పాటిస్తారు. ఈ నేప‌థ్యంలో ఈ ఊహించ‌ని ప‌రిణామం ఆయన ప్లానింగ్‌ను ఎలా మార్చుతుందన్నది ఆసక్తిగా మారింది.

ఇదే సమయంలో అభిమానుల్లో కూడా చర్చలు మొదలయ్యాయి. సినిమాలోని ఈ కీల‌క‌ షెడ్యూల్ షూటింగ్ లేటైతే, సినిమా రిలీజ్ టైమ్‌లైన్‌పై అది ప్రభావం పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే, మేకర్స్ ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. భారీ నీటి వినియోగం అవసరమైన సీన్స్ కోసం విదేశీ లొకేషన్స్, ప్రత్యేకంగా నీటి సదుపాయాలు ఉన్న స్టూడియోలు లేదా అధునాతన CGI టెక్నాలజీ వినియోగం లాంటి ఆప్షన్లు కూడా పరిశీలనలోకి వచ్చాయని టాక్. గతంలో కూడా పెద్ద సినిమాలు ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ షూట్స్ లేదా స్టూడియో సెటప్‌లను ఆశ్రయించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు వార‌ణాసి కూడా అదే దారికి మళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. మొత్తానికి, నీటి కొరత నేపథ్యంలో ప్రారంభమైన ఈ సమస్య షూటింగ్ ప్లాన్స్, రిలీజ్ అంచనాలు, ప్రొడక్షన్ స్ట్రాటజీలపై ఎలా ప్రభావం చూపుతుందన్నది చూడాలి. అయితే ఈ వార్త‌ల‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఆధారాలు లేక‌పోవ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం.

Tags:    

Similar News