నీల్ లైనప్.. బాబుతో ఛాన్స్ ఉంటుందా?
టాలీవుడ్, శాండల్ వుడ్ సర్కిల్స్ లో ఇప్పుడు మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తదుపరి సినిమాల లైనప్ గురించి ఒక పెద్ద చర్చ నడుస్తోంది.
టాలీవుడ్, శాండల్ వుడ్ సర్కిల్స్ లో ఇప్పుడు మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తదుపరి సినిమాల లైనప్ గురించి ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఫిల్మ్ నగర్ లో బలంగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆయన చేతిలో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయట. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ తో డ్రాగన్, ఆ తరువాత ప్రభాస్ తో సలార్ 2, యష్ తో కేజీఎఫ్ 3 లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు పక్కాగా లైనప్ లో కనిపిస్తున్నాయి.
అయితే ఈ లిస్ట్ లో డ్రాగన్ 2, అల్లు అర్జున్ ప్రాజెక్టుల పేర్లు కూడా గట్టిగా వినిపిస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏ దర్శకుడికైనా సరే ఇంత భారీ స్థాయిలో టాప్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాన్ చేసుకోవడం మామూలు విషయం కాదు. కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ప్రశాంత్ నీల్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ పై గతంలో చర్చలు జరిగిన మాట వాస్తవమే అయినా, దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
అలాగే ఎన్టీఆర్ తో తీస్తున్న డ్రాగన్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారనే దాంట్లో కూడా ఇంకా సరైన క్లారిటీ లేదు. అంటే ప్రస్తుతానికి పక్కాగా కన్ఫర్మ్ అయినవి డ్రాగన్, సలార్ 2, కేజీఎఫ్ 3 ప్రాజెక్టులు మాత్రమే. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ కు ఒక మెగా ప్రాజెక్ట్ ఉండబోతోందనే వార్త నెట్టింట గత రెండు రోజుల నుంచి వైరల్ అవుతోంది.
మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో వారణాసిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వేల కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి రానుంది. రాజమౌళి సినిమా స్కేల్, ఆయన వర్కింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి ఆ తరువాత మహేష్ చేయబోయే సినిమా కూడా అంతకుమించి అనేలా ఉండాలి. అందుకు నీల్ బెస్ట్ ఛాన్స్. అలాంటి ఛాన్స్ వస్తే మహేష్ కూడా వదిలే రకం కాదు. కానీ ప్రశాంత్ నీల్ వైపు నుంచి చూస్తే ఈ క్రేజీ కాంబినేషన్ కు వెంటనే టైమ్ దొరికేలా లేదు.
ఆయన ముందుగా ఎన్టీఆర్ తో డ్రాగన్ వర్క్ పూర్తి చేయాలి. ఆ వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ 2 సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. KGF 3 ఎప్పుడు అనేది సరైన క్లారిటీ లేదు. ఈ లైనప్ ప్రకారం వెళితే మహేష్ మరో రెండు సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుంది. లేదంటే సలర్ 2 తరువాత వెంటనే గ్యాప్ తీసుకొని సినిమా చేసుకోవచ్చు. సెట్టయితే ఇది బెస్ట్ కాంబినేషన్ అవుతుంది.
ఏదేమైనా మహేష్ బాబు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ భవిష్యత్తులో పట్టాలెక్కే అవకాశం ఉంది. కానీ అది ఇప్పుడే వెంటనే జరిగే పని కాదు. ప్రస్తుత కమిట్మెంట్స్ క్లియర్ అవ్వడానికి కనీసం మూడేళ్లకు పైనే సమయం పడుతుంది. రాజమౌళి సినిమా పూర్తయ్యేసరికి మహేష్ బాబు మార్కెట్ గ్లోబల్ లెవెల్ కు చేరుకుంటుంది. ఆ భారీ ఇమేజ్ కి ప్రశాంత్ నీల్ మార్క్ ఇంటెన్స్ యాక్షన్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర వచ్చే ఇంపాక్ట్ ఊహకందని రేంజ్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.