ఆ స్టార్ డైరెక్ట‌ర్ మైండ్ లో మ‌హేష్‌-ప్ర‌భాస్!

టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఆ సందడే వేరు.;

Update: 2026-05-08 02:30 GMT

టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఆ సందడే వేరు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ ఫిల్మ్ స‌ర్కిల్స్ లో షురూ అయింది. స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి టాలీవుడ్ ఇద్దరు దిగ్గజాలైన‌ సూపర్ స్టార్ మహేష్ - రెబల్ స్టార్ ప్రభాస్‌లతో భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలని ఒక డ్రీం ఉంది అంట. ఇద్ద‌రి గ్లోబ‌ల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓ యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్ ను తెర‌కెక్కించా ల‌నుకుంటున్న‌ట్లు తెలిసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. వంశీ పైడిపల్లికి మహేష్ `మహర్షి` వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్ ఉంది.

అలాగే ప్రభాస్‌తో మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓ పవర్‌ఫుల్ లైన్ సిద్ధం చేసాడుట వంశీ. ప్రస్తుతం మహేష్ , రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత మహేష్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుతుంద‌ని వంశీ కూడా ప్రీపేర్డ్ గా ఉన్నారు. ఈ సినిమా అనంత‌రం మ‌హేష్ గ్లోబల్ స్టార్ గా అవతరిస్తారని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రభాస్ ఇప్ప‌టికే `కల్కి 2898 ఏడీ`తో గ్లోబ‌ల్ ఇమేజ్ ద‌క్కించ‌కున్నారు. త‌దుప‌రి రాబోయే సినిమాలతో గ్లోబల్ మార్కెట్‌లో సత్తా చాట‌డానికి రెడీగా ఉన్నారు. `బాహుబ‌లి` లాంటి విజ‌యం అత‌డిని ఇప్ప‌టికే ఆ రేంజ్ కు తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈనేప‌థ్యంలో వంశీ ఇద్ద‌రి ఇమేజ్ ను, భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని వంశీ అడ్వాన్స్ గా ఆలోచిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఏఐ రాజ్యం ఏల‌క ముందే? అదే కాన్సెప్ట్ ను తీసుకుని `మ‌హ‌ర్షి` చిత్రాన్ని వంశీ చేసిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు ఏఐ గొప్ప‌త‌నం పెద్ద‌గా తెలియ‌లేదు. కానీ నేడు ఏఐ ఎంత‌గా వినియోగంలో ఉందో తెలిసిందే.

ఇలాంటి కాన్సెప్ట్ ను ఎంతో సెన్సిటివ్ గా డీల్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు. ఇలాంటి అంశాల్ని డీల్ చేయ‌డంలో వంశీ స్పెష‌లిస్ట్ అనొచ్చు. ఈ నేప‌థ్యంలో ఇద్దరు గ్లోబల్ స్టార్లను లైన్ లో పెడుతున్నాడంటే? స్టోరీ లైన్ యూనిక్ గానే ఉంటుంది. ఆ సినిమా మార్కెట్ వందల కోట్లలో కాదు. వేల కోట్లలో ఉంటుందన‌డంలో సందేహం లేదు.వంశీ పైడిపల్లి గతంలో `ఊపిరి` వంటి సినిమాలతో మల్టీస్టారర్ చిత్రాలను ఎంత హుందాగా డీల్ చేసారో తెలిసిందే. ఇద్దరు అగ్ర హీరోల మధ్య ఇగో సమస్యలు రాకుండా ఇద్దరి పాత్రలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ కథను నడపడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఈ నేప‌థ్యంలో మహేష్ క్లాస్ అండ్ స్టైలిష్ లుక్, ప్రభాస్ మాస్ అండ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను ఒకే ఫ్రేమ్‌లో ప్ర‌త్యేకంగా డిజైన్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడ‌త‌డు. స్టోరీ ఒకే అయినా? ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి చాలా స‌మ‌యం అవకాశం ఉంది. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అది పూర్త‌యిన త‌ర్వాత ఈ డ్రీం ప్రాజెక్ట్ ఎమన్నా ముందుకు తీసుకువెళ్తాడేమో చూద్దాం. 

Tags:    

Similar News