టాలీవుడ్ టాప్ టూరిస్ట్ ఫ్యామిలీ
టాలీవుడ్ నుంచి సెలబ్రిటీ కుటుంబాలు ఇటీవల వెకేషన్స్ పేరుతో రెగ్యులర్ గా విదేశాలకు వెళ్లడం చూస్తున్నదే.;
టాలీవుడ్ నుంచి సెలబ్రిటీ కుటుంబాలు ఇటీవల వెకేషన్స్ పేరుతో రెగ్యులర్ గా విదేశాలకు వెళ్లడం చూస్తున్నదే. మహేష్, చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులు తమ భార్య పిల్లలతో ఫారిన్ ట్రిప్ లు వెళుతున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లోకి వస్తున్నాయి. అయితే వీళ్లందరిలో సూపర్ స్టార్ మహేష్ రెగ్యులర్ టూరిస్ట్ గా డిక్లేర్ అయ్యాడు. అతడు షూటింగ్ ప్రారంభించడానికి ముందు, ముగిసిన తర్వాత, మధ్యలో ఇంటర్వెల్స్ లో తన కుటుంబంతో కలిసి విదేశీ వెకేషన్లను ప్లాన్ చేస్తుంటాడు. మహేష్ కుటుంబం రెగ్యులర్ గా దుబాయ్, లండన్, అమెరికా, యూరోపియన్ దేశాలకు వెళ్లి రావడం తెలిసిందే. విదేశాల్లోని సుందర నగరాలను ఆస్వాధించడంలో మహేష్ ఫ్యామిలీ ఎప్పుడూ బిజీ.
కారణం ఏదైనా తమిళ హిట్ చిత్రం `టూరిస్ట్ ఫ్యామిలీ` వీక్షించాక, ఈ తరహాలో టాలీవుడ్ లో ఎవరున్నారు? అని ఆరాలు తీసిన వారికి మహేష్ ఫ్యామిలీనే మొదటగా కనిపిస్తోంది. టూరిస్ట్ ప్యామిలీ సినిమాని వీక్షించిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇంతకుముందు ప్రశంసలు కురిపించారు. సినిమా చూసాక `హార్ట్ టచింగ్ మూవీ` అంటూ జక్కన్న పొగిడేశారు. రాజమౌళి ట్వీట్ కు ఫన్నీగా స్పందించిన ఓ నెటిజన్ మహేష్ కుటుంబ చిత్రాన్ని పోస్ట్ చేసి `ఇంతలో ఆ టూరిస్ట్ ఫ్యామిలీ` అని రాశారు. ఇది చాలా ఫన్నీగా ఉన్నా రియాలిటీని ఆవిష్కరిస్తోంది. మహేష్ కుటుంబం నిజమైన టూరిస్ట్ ఫ్యామిలీగా గుర్తించాలి.
మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ పూర్తవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. వీఎఫ్ఎక్స్ కోసం అంతర్జాతీయ స్టూడియోలు పని చేయనున్నాయి.