పుష్పరాజ్ గా మహేష్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్లుగా నిలిచాయి.;

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్లుగా నిలిచాయి. రెండు భాగాలుగా రిలీజైన ఈ సినిమాలు మంచి టాక్ తో పాటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కూడా కురిపించాయి. అంతేకాదు, పుష్ప సినిమా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డును సైతం తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా అల్లు అర్జున్ కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు వద్దకు వెళ్లొచ్చిందని అప్పట్లో టాక్ వినిపించింది. సుకుమార్ పుష్ప కథను ముందు మహేష్ బాబుకు చెప్పాడని, కానీ కొన్ని కారణాల వల్ల అది సెట్స్ పైకి వెళ్లలేదని, ఆ తర్వాత అదే కథను సుకుమార్, అల్లు అర్జున్ కు సెట్టయ్యేలా మార్చి పుష్పగా తీశారని అంటూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే పుష్ప సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యాక అనవసరంగా మహేష్ ఈ సినిమాను వదులుకున్నాడే అని ఆయన ఫ్యాన్స్ ఫీలయ్యారు. కానీ ఇప్పుడు పెరుగుతున్న జెనరేషన్ లో ఏఐ ఆధారంగా అసాధ్యమైనవన్నీ సాధ్యమవుతున్నాయి. అందులో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పుష్ప సినిమాలో మహేష్ బాబు నటించి ఉంటే ఎలా ఉండేదని ఓ వీడియో చేయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మహేష్ ఫ్యాన్స్ చేసిన ఈ వీడియోలో పుష్ప సినిమాలోని పలు సీన్స్ ను ఏఐ సాయంతో మహేష్ బాబును పెట్టి రీక్రియేట్ చేశారు. అందులో పుష్ప రాజ్ గా మహేష్ బాబును చూసి మహేష్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతూ, ఆ వీడియోను షేర్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. మహేష్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.