తండ్రికి ఆ విధంగా గిఫ్ట్ ఇచ్చిన గౌతమ్.. పోస్ట్ వైరల్!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు మహేష్ బాబు.. ఇప్పటివరకు తెలుగులోనే సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు తొలిసారి ఎల్లలు దాటుతున్నారు.;

Update: 2025-08-09 05:55 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు మహేష్ బాబు.. ఇప్పటివరకు తెలుగులోనే సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు తొలిసారి ఎల్లలు దాటుతున్నారు. ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఆఫ్రికన్ అడ్వెంచర్ నేపథ్యంలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు మహేష్ బాబు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు మహేష్ బాబు 50వ పుట్టినరోజు ఈ సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు వారసుడు ఘట్టమనేని గౌతమ్ కూడా తన తండ్రికి ఆ విధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి.. అందరి దృష్టిని ఆకర్షించారు. గౌతమ్ ఘట్టమనేని ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఆ పోస్ట్ తండ్రి పై తనకున్న ప్రేమను, ఆప్యాయతను కళ్ళకు కట్టినట్టు తెలియజేస్తోంది అని మహేష్ బాబు అభిమానులు కూడా తెగ సంతోష పడిపోతున్నారు. మరి ఆ పోస్ట్ లో ఏముంది? ఘట్టమనేని గౌతమ్ తన తండ్రికి ఏ విధంగా బర్తడే విషెస్ తెలియజేశారు? ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

తన తండ్రితో కలిసి గడిపిన మధుర క్షణాలను ఫోటోల రూపంలో పంచుకుంటూ.." నాన్న.. ఎప్పటికీ నువ్వే నా తొలి హీరో.. ఈ బర్తడే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాన్న" అంటూ తన తండ్రికి స్పెషల్ గా పుట్టినరోజు విషెస్ తెలియజేశారు ఘట్టమనేని గౌతమ్ ..ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతి కొడుకుకి తన తండ్రి ఫస్ట్ హీరో.. అలాగే గౌతమ్ కూడా తన తండ్రిని తన ఫస్ట్ హీరోగా ఎంచుకోవడం ప్రశంసనీయం అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే సోషల్ మీడియా ద్వారా తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అందరి దృష్టిని ఆకర్షించారు గౌతమ్ ఘట్టమనేని.

ఇక గౌతమ్ ఘట్టమనేని విషయానికి వస్తే.. సినిమాల్లోకి రాకముందే తన అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ చూపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఎన్ వై యు టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కి సంబంధించిన ఒక స్కిట్ లో తన కో స్టూడెంట్ తో కలిసి నటించి అదరగొట్టేశారు. వీడియో మొదట్లో చిరునవ్వుతో కనిపించిన గౌతమ్.. క్షణాల్లోనే ఆగ్రహావేశాలతో ఊగిపోతాడు. అది చూసిన ఆ అమ్మాయి టెన్షన్ పడుతుం. ది ఇందుకు సంబంధించిన కంప్లీట్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. గౌతమ్ ను చాలా సైలెంట్ కుర్రాడు అనుకున్న అభిమానులు.. ఆయనలోని ఈ వైలెంట్ సైడ్ చూసి ఆశ్చర్యపోయారు. గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి పూర్తిగా సిద్ధం అయ్యాడు అని.. ఒక హాలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ ఎంట్రీ కి ప్లాన్ చేస్తున్నాడని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు మళ్ళీ ఈ విషయంపై ఎటువంటి అప్డేట్ లేకపోవడం గమనార్హం.

Tags:    

Similar News