మహావతార్ నరసింహా రేంజ్ లోనే మరొకటి.. థియేటర్లు బ్లాస్టే!

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది.;

Update: 2025-08-05 12:16 GMT

మహావతార్ నరసింహ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. పాన్ఇండియా సినిమాలు హరి హర వీర మల్లు, కింగ్డమ్ లపై పైచేయి సాధిస్తూ.. ఈ సినిమా బీభత్సం సృష్టిస్తోంది. యానిమేటెట్ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరడంతో సినీ ప్రపంచం నివ్వెరబోతుంది.

ప్రమోషన్లు లేవు, పోస్టర్లు లేవు, హాడావుడి లేదు. కేవలం రిలీజ్ రోజు పాజిటివ్ మౌత్ టాక్ తోనే ఇంతటి కలెక్షన్లు రావడం మేకర్స్ కు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. దర్శకుడు అశ్విన్ కుమార్, ప్రొడక్షన్ కంపెనీ హోంబాలే ఫిల్మ్స్ కు ఇదిఓ జాక్ పాట్ గానే చెప్పుకోవాలి. అయితే ఈ సిరీస్ లో 2037 దాకా వరుస సినిమాలు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటన చేశారు.

ఈ క్రమంలోనే మహావతార్ యానిమేటెడ్ యూనివర్స్ నుంచి తదుపరి రానున్న సినిమా మహావతార్ పరశురామ. దీని గురించి ఓసారి మాట్లాడుకుంటే..శ్రీ మహావిష్ణువు దశావతారాలలో పరశురాముడి అవతారం ఆరవది. త్రేతాయుగం ఆరంభంలో ఆయన ఉద్భవిస్తాడు. అధికార మదంతో పొగరెక్కి ఇష్టారీతిన వ్యవహరిస్తున్న క్షత్రియులను తుదముట్టించిన చరిత్ర ఆయనకు కలదు.

భార్గవ రాముడు, జమదగ్ని అనేవి పరశురాముడికి ఉన్న మరో రెండు పేర్లు ఉన్నాయి. అయితే పరశురాముడికి మహాభారతం, రామాయణం రెండు ఇతిహాసాలోనూ ఆయనకు సంబంధం ఉంది. శివ ధనుస్సును విరిచినందుకు రాముడిపై యుద్ధం ప్రకటించడం.. ఆ తర్వాత శాంతించి విష్ణు చాపాన్ని అందించడం అనేది పురాణాలలో ఉంది. భారతంలో కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు ముగ్గురికి పరశురాముడు గురువుగా చెబుతారు. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద స్టోరీయే ఉంది.

అయితే ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ ఎవరు కూడా పరశురాముడిని హీరోగా చూపించలేదు. ఏదైనా సినిమాలో చిన్న రోల్ లో చూపించడమో లేదా టైటిల్ కోసం పేరును వాడుకోవడమో జరిగింది. అంతేకానీ ఆయన గొప్పతనం గురించి చెప్పే ప్రయాత్నాలు జరగలేదు. అయితే ఆయన గురించి ఈ తరానికి తెలిసేలా కథను రెడీ చేశారని తెలుస్తోంది.

అంతేకాకుండా ఈసారి గ్రాఫిక్స్, విజువల్ కు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, బడ్జెట్ ను మరింత పెంచి, భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ యానిమేటెడ్ సినిమాగా నిలుపడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. సినిమాకు ఇంకా హైప్ పెంచడానికి డార్లింగ్ ప్రభాస్ లాంటి బడా హీరో తో మెయిన్ లీడ్ పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. చూడాలి మరి మహావతార్ సిరీస్ లో తొలి సినిమాతోనే లభించిన మంచి ఆరంభాన్ని రెండో సినిమా ఏ లెవెల్ కు తీసుకెళ్తుందో!

Tags:    

Similar News