• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హోంబాలే నరసింహా.....

హోంబాలే నరసింహా.. లుక్కుతోనే షాక్ ఇచ్చారుగా

| అందులో మొదటి భాగంగా 'మహావతార్ నరసింహా' అనే చిత్రం రాబోతోంది.

By - Tupaki Desk
Update: 2024-11-16 11:51 GMT

హోంబాలే ఫిల్మ్స్.. అంటేనే భారీ సినిమాలకు కేరాఫ్ ప్రొడక్షన్. ఎలాంటి సినిమా వచ్చినా కూడా పాన్ ఇండియా మార్కెట్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆ సంస్థ మరో అద్భుతమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల విడుదలైన పోస్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సంస్థ, మహావతార్ సిరీస్‌ను ప్రారంభించింది. అందులో మొదటి భాగంగా 'మహావతార్ నరసింహా' అనే చిత్రం రాబోతోంది. సినిమాకు సంబంధించిన స్పెషల్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇక 3Dలో హై రేంజ్ విజువల్స్ తో సినిమా రానున్నట్లు తెలుస్తోంది.


హోంబాలే ప్రొడక్షన్స్ నుంచి ఇంతకుముందు వచ్చిన 'కాంతార,' 'కేజీఎఫ్,' 'సలార్' వంటి సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు నరసింహా అవతారం ఆధారంగా నిర్మితమవుతున్న ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి పెంచుతోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఈ మధ్య కాలంలో దేవుడి బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాల పట్ల ప్రాధాన్యత పెరిగిన సంగతి తెలిసిందే.

కాంతార వంటి సినిమాలు ఈ ట్రెండ్‌ను మరింత పెంచాయి. 'మహావతార్ నరసింహా' పోస్టర్‌ను చూసిన తర్వాత నెటిజన్లు విపరీతంగా ఎట్రాక్ట్ అవుతున్నట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్ధమవుతుంది. ఒక విధంగా మోషన్ పోస్టర్ తో కూడా హై రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. "నరసింహ స్వామి అవతారంలో ప్రభాస్ కనిపిస్తే పూనకాలే," అంటూ కామెంట్లు పెడుతున్నారు.

హోంబాలే ఫిల్మ్స్‌తో ప్రభాస్ ఇప్పటికే రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో ఒకటిగా ఈ సినిమా ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు. పోస్టర్‌లో నరసింహా స్వామి రూపం అద్భుతంగా చిత్రీకరించారు. "విశ్వాసం సవాలుగా ఉన్నప్పుడు అతను కనిపిస్తాడు," అనే ట్యాగ్‌లైన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. దేవతా అవతారాలను ఆధారంగా తీసుకుని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి హోంబాలే ఫిల్మ్స్ సిద్ధమవుతోంది.

పోస్టర్‌లో నరసింహుడి రూపం, బలం, దైవత్వం స్పష్టంగా కనిపిస్తోంది. హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ సిరీస్‌తో ప్రేక్షకులకు మరో విభిన్న అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. నరసింహుడు పాత్రలో ప్రభాస్ కనిపిస్తారా? లేదా మరో నటుడు ఈ అద్భుత పాత్రకు ప్రాణం పోస్తారా? అన్న ఆసక్తికర విషయాలు త్వరలో తెలిసే అవకాశముంది. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన స్టార్ క్యాస్ట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు. సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Full View
Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Kanthara 
  • Kgf 
  • Salaar 
  • Narasimha 
  • Narasimhaavatar 
  • Mahavatarseries 
  • MahavatarNarasimha 
  • Poster 
  • Ashvinkumar 
  • Hombalefilms 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS