వీకెండ్ బాక్సాఫీస్.. మహవతార్ తప్ప అన్నీ ఢమాల్!

ఎప్పటిలానే వీకెండ్ కంప్లీట్ చేసుకుని వీక్ డేస్ లోకి వచ్చేశాం. అయితే ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా రిలీజ్ లు లేవు.;

Update: 2025-08-25 10:38 GMT

ఎప్పటిలానే వీకెండ్ కంప్లీట్ చేసుకుని వీక్ డేస్ లోకి వచ్చేశాం. అయితే ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా రిలీజ్ లు లేవు. పరిగణనలోకి యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా సినిమా మాత్రమే తీసుకోవచ్చు. సోషల్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాకు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించగా, ఆగస్టు 22న రిలీజ్ అయింది.

పరదా సినిమా కాన్సెప్ట్ కొత్తదే అయినా.. అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్ ను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.. పేలవమైన స్పందన మాత్రమే రాబట్టుకుంది. దీంతో ఈ వీకెండ్ బాక్సాఫీస్ చాలా సైలెంట్ గా ఉంది. ఎలాంటి సందడి లేదు. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అదే సమయంలో ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు థియేటర్స్ లో ఉన్నా.. అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. మహవతార్ నరసింహ మిగతా చిత్రాలు.. అనుకున్నంతగా వసూల్ చేయలేదు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించిన కూలీ మూవీ కలెక్షన్స్ లో పెద్దగా ఎలాంటి వృద్ధి కనిపించలేదు.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన వార్-2 మూవీ వసూళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. చిన్న మూవీగా విడుదలై పెద్ద విజయం సాధించిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ మాత్రం ఈ వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టడం గమనార్హం.

సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటికే సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. రూ.300 కోట్ల క్లబ్ వైపు పయనిస్తోంది. మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. మహావతార్ నరసింహ ప్రేక్షకులకు మొదటి ఎంపికగా నిలిచింది. నాలుగో వీకెండ్ లో కూడా సందడి చేయడం మామూలు విషయం కాదు.

కన్నడ డబ్బింగ్ మూవీ సూ ఫ్రమ్ సో బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు మాత్రం సాధించింది. దీని బట్టి చూస్తే.. మహవతార్ నరసింహ తప్ప మిగతా ఒక్కటంటే ఒక్క మూవీ సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టలేదన్నమాట. దీంతో ఈ వీకెండ్ బాక్సాఫీస్ పరంగా పేలవంగా ముగిసింది. ఆగస్టు చివరి వారంలో పెద్దగా విడుదలలు లేవు. మళ్లీ సెప్టెంబర్ లో బాక్సాఫీస్ కళకళలాడుతుందేమో చూడాలి.

Tags:    

Similar News