వీడియో : 'మహావతార్ సలార్' ను చూశారా..!
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న 'మహావతార్ నరసింహా'కు సంబంధించిన విషయాలు, విశేషాలను సోషల్ మీడియాలో పలువురు షేర్ చేస్తూ ఉన్నారు.;
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న 'మహావతార్ నరసింహా'కు సంబంధించిన విషయాలు, విశేషాలను సోషల్ మీడియాలో పలువురు షేర్ చేస్తూ ఉన్నారు. సినిమా గురించిన పలు విషయాలను యూనిట్ సభ్యులు ఎప్పటికప్పుడు షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే. ఈ భారీ యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. పలు సినిమాలను వెనక్కి నెట్టి మరీ మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన యానిమేటెడ్ మూవీస్ లో మహావతార్ నరసింహా సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇండస్ట్రీ వర్గాల్లో, బాక్సాఫీస్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
యానిమేటెడ్ మహావతార్ నరసింహా
మహావతార్ నరసింహా సినిమాలో కొన్ని విజువల్స్‌ను తీసుకుని సలార్ చిత్ర యూనిట్ సభ్యులు ఆసక్తికర వీడియోను తయారు చేశారు. సలార్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు, ప్రభాస్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన విజువల్స్‌తో మహావతార్ విజువల్స్‌ను యాడ్ చేయడం ద్వారా సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా ఎడిట్ చేశారు. సలార్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. 29 సెకన్ల ఈ వీడియోతో ప్రభాస్ అభిమానులకు మహావతార్ సినిమా మరింత చేరువ అయింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి బజ్ ఉన్న మహావతార్ సినిమా కు మరింతగా క్రేజ్ పెరిగినట్లు అయింది.
సలార్ కాటేరమ్మ యాక్షన్ సీక్వెన్స్
సలార్ లోని కాటేరమ్మ వీడియోను మహావతార్ తో మిక్సింగ్ చేయడం ద్వారా ప్రభాస్‌ను మరో నరసింహ స్వామి అంటూ అభిమానులు తెగ సందడి చేస్తూ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. సలార్ టీం ఎక్స్ లో ఈ వీడియోను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్ దక్కాయి. అంతే కాకుండా ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ప్రభాస్ ను సలార్ లుక్‌లో మళ్లీ ఎప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వీడియో కాస్త హైప్ ఇచ్చింది. మరోసారి సలార్ సినిమా గురించి చర్చ జరిగేలా చేసింది. సలార్‌లోని యాక్షన్ సీన్స్‌తో పోల్చుతూ ఇప్పటికే మహావతార్ నరసింహా సినిమా సీన్స్‌ను ఎడిట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
సలార్ 2 కోసం వెయిటింగ్
ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా సలార్ 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించింది. సలార్ 2 సినిమా సైతం అంతకు మించి వసూళ్లు సాధిస్తుంది అని అంతా నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాను చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలోనే సలార్ 2 ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సలార్ 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సలార్ 2 లో మరింతగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని తెలుస్తోంది.