అత్యధిక రన్ టైమ్ కలిగిన చిత్రాలివే.. ఫలితం తెలిస్తే షాక్..
సాధారణంగా ఏ సినిమా అయినా సరే 2 గంటలు లేదా రెండున్నర గంటలకు మించి నిడివి ఉంది అంటే ప్రేక్షకుడు అంతసేపు థియేటర్లో కూర్చుంటారా అనే అనుమానాలు కలుగుతాయి.;
సాధారణంగా ఏ సినిమా అయినా సరే 2 గంటలు లేదా రెండున్నర గంటలకు మించి నిడివి ఉంది అంటే ప్రేక్షకుడు అంతసేపు థియేటర్లో కూర్చుంటారా అనే అనుమానాలు కలుగుతాయి. ముఖ్యంగా కంటెంట్ బాగుంటే మూడు గంటల వరకు అయినా ప్రేక్షకుడిని కూర్చోబెట్టగలం. ఒకవేళ అంతకుమించి నిడివి అంటే.. అంత కథ ప్రేక్షకులను మెప్పిస్తుందా? అసలు అంత సేపు థియేటర్లో ప్రేక్షకుడి కూర్చోగలుగుతాడా ? అనే సందేహం కూడా కలుగుతుంది. అయితే ఇక్కడ మాత్రం కొన్ని చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవి 2 గంటలు కాదు..3 గంటలు కాదు ఏకంగా 5 గంటలకు పైగా నిడివి ఉన్న కొన్ని చిత్రాలు ప్రేక్షకులను ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాయి.
సాధారణంగా ప్రతి చిత్ర నిర్మాతకు మూడు గంటలలోపే ప్రేక్షకుడికి వినోదం అందించడం అలవాటుగా మారిపోయింది. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయి కంటెంట్ అనుకున్నంత స్థాయిలో లేకపోతే జనాలు కూడా సినిమా చూడడంలో అలసిపోతారు. కానీ ప్రేక్షకులను పెద్ద తెరపై నిమగ్నం చేయగలిగిన కొన్ని శీర్షికలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీనికి కారణం మంచి స్క్రీన్ ప్లే, సంగీతం, రియల్ కంటెంట్ పై దృష్టి మరల్చని కొన్ని కారణాలు సినిమా నిడివి ఎక్కువైనా ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దారు. మరి ఆ చిత్రాలేంటి? వాటి నిడివి ఎంత? వాటి ఫలితం ఏంటి? అనే విషయాలు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
పైగా ఈ చిత్రాలు అత్యధిక నిడివి ఉన్న చిత్రాలుగా రికార్డు సృష్టించాయి.ఆ చిత్రాల విషయానికి వస్తే..
1. మహాత్మా: (గాంధీ జీవిత చరిత్ర : 1869 - 1948)
భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వారిలో మహాత్మా గాంధీ పేరు ప్రథమంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఈయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహాత్మ డాక్యుమెంటరీ ఫిలిం ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ముఖ్యంగా ఆయన గురించి తెలియని ప్రతి అంశంపై కూడా ఈ డాక్యుమెంటరీ దృష్టిసారించింది. ముఖ్యంగా ఐదు గంటలకు పైగా నిడివి తో వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ప్రముఖ దర్శకుడు విఠల్ భాయ్ ఝవేరి ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు.. 330 నిమిషాల నిడివితో వచ్చిన ఈ డాక్యుమెంటరీ ఫిలిం మహాత్మా గాంధీ కి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలియజేస్తుంది.
2. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్:
నేరం, హింస కాన్సెప్ట్ తో.. ధన్బాద్ బొగ్గు మాఫియాపై ప్రత్యేక ప్రాధాన్యతతో పాటూ మూడు కుటుంబాల మధ్య శత్రుత్వంపై తెరకెక్కిన చిత్రం ఇది. అనురాగ్ కశ్యప్ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సుమారుగా 319 నిమిషాల నిడివి గల ఒకే చిత్రంగా రూపొందించిన ఈ సినిమాను 2 వేరువేరు భాగాలుగా విభజించి రెండు నెలల వ్యవధిలోనే విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.
3. లగాన్:
అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకుంది. భారతదేశంలో బ్రిటిష్ పాలనపై.. ప్రధాన దృష్టితో ఒక కొత్త కథను రాశారు. ముఖ్యంగా కరువు, భూమి పన్నులను సకాలంలో చెల్లించలేక ఇబ్బంది పడుతున్న ఒక గ్రామంలోని రైతులు.. పన్నుల నుండి ఉపశమనం పొందడానికి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అధికారి నుండి క్రికెట్ మ్యాచ్ సవాల్ ను స్వీకరిస్తారు. అలా ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ కథాంశం ప్రేక్షకులను మెప్పించింది. 233 నిమిషాల రన్ టైం తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
వీటితోపాటు.. 4. తమస్ - 298 నిమిషాలు
5.LOC: కార్గిల్ - 255 నిమిషాలు
6. మేరా నామ్ జోకర్ - 248 నిమిషాలు
7. సంఘం - 238 నిమిషాలు
8. అనిమల్ -201 నిమిషాలు
9. మొఘల్ - ఎ - ఆజం - 197 నిమిషాలు
10. సౌదాగర్ - 193 నిమిషాలు
11. హమ్ ఆప్కే హై కోన్ - 206 నిమిషాలు
12. మొహబ్బతీన్ - 216 నిమిషాలు
13. పుష్ప 2 - 200 నిమిషాలు
14. కుచ్ కుచ్ హోతా హై - 177 నిమిషాలు
15. కభీ ఖుషీ కభీ ఘమ్ - 180 నిమిషాలు
16. కభీ అల్విదా నా కెహనా - 192 నిమిషాలు
17. కల్ హో నా హో - 187 నిమిషాలు
18. బాహుబలి ది ఎపిక్ - 225 నిమిషాలు
వీటితోపాటు మరికొన్ని చిత్రాలు కూడా ఎక్కువ రన్ టైం తో వచ్చి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచి సరికొత్త రికార్డులు సృష్టించాయి.