ఈ రెండు సినిమాలు ఇప్పుడు వచ్చుంటే ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేసేవంటే.?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తుంటాయి.

Update: 2026-09-30 03:15 GMT

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తుంటాయి. ఆ సినిమాలు ఏ సమయంలో వచ్చినా కూడా వాటికి మంచి ఆదరణ దక్కుతుంది. అప్పట్లో మగధీర, రోబో లాంటి సినిమాలు వచ్చి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ సినిమాలు అప్పుడు ఇండస్ట్రీ హిట్లుగా నిలువడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. కానీ ఆ సినిమాలు ఇప్పుడు కనక వచ్చుంటే ఈజీగా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టేవి... నిజానికి ఈ సినిమాలు ఏ జనరేషన్ వారికైనా నచ్చుతుంటాయి. కథలో కాన్ఫ్లిక్ట్ పర్ఫెక్ట్ గా కుదిరింది కాబట్టి ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంటాయి. మొత్తానికైతే ఈ సినిమాలు ఇప్పుడున్న జనరేషన్ ప్రేక్షకులకు మరింత ఎక్కువగా నచ్చేవనేది వాస్తవం...

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర' సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. అలాగే రామ్ చరణ్ వారియర్ గా 100 మందిని చంపి గాని చావని వీర యోధుడి గా కనిపించాడు. కాబట్టి అతని క్యారెక్టరైజేషన్ కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అలాంటి సినిమా ఈ రోజుల్లో వచ్చి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ను ఇచ్చి ఉండేది. ఇక 'రోబో' సినిమా హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కింది. రోబో ఎలాంటి పనులు చేయగలదు. ఎలాంటి వినాశనాన్ని సృష్టించగలదనేది ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా తెలియజేశారు... అందువల్లే ఈ రెండు సినిమాలు ఎప్పుడు వచ్చినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనేది వాస్తవం... ప్రస్తుతం మన మేకర్స్ పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

మగధీర మూవీ పాన్ ఇండియా సినిమా గా రాలేదు. కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత ఈ సినిమాని ఇతర భాషల్లోకి డబ్ చేసి టీవీల్లో రిలీజ్ చేశారు. దాని వల్ల ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఈ సినిమాను చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. ఇలాంటి సినిమాని థియేటర్లో చూస్తే బాగుండేదని ఇతర భాషల ప్రేక్షకులు కూడా కోరుకున్నారంటే ఈ సినిమా ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు... ఇక ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' మూవీ చేస్తుంటే శంకర్ మాత్రం 'గేమ్ చేంజర్' మూవీతో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. తన తదుపరి మూవీని ఇంకా స్టార్ట్ చేయలేదు...

Tags:    

Similar News