త్రివిక్రమ్‌కు రెండు పెద్ద పరీక్షలు..పాస్ అవ్వక తప్పదు!
| వెంకటేష్‌తో తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం ఆశించిన విజయం సాధించకపోవడంతో త్రివిక్రమ్ తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది. చిరంజీవికి ఓ కథ వినిపించగా, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని మెగాస్టార్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్‌తో గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ కూడా ఉండటంతో త్రివిక్రమ్ ముందుగా ఎవరితో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి సినిమా ఏమిటనే దానిపై.. రకరకాల అట్టలు వినిపిస్తున్నా. వెంకటేష్‌తో ఆయన తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో..ఇప్పుడు త్రివిక్రమ్ తన తర్వాతి ప్రాజెక్ట్‌పై చాలా శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం చిరంజీవి కాకా సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు 2027లో విశ్వంభర, కాకా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మెగాస్టార్ సినిమా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ ఇప్పటికే చిరంజీవికి ఒక కథను వినిపించారట. ఆ కథలోని ప్రధాన అంశం నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని మెగాస్టార్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించే అవకాశాలు ఉన్నాయని టాక్. గతంలో త్రివిక్రమ్ ఇదే కథను రామ్ చరణ్‌కు కూడా వినిపించినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు కథలో కొన్ని మార్పులు చేసి చిరంజీవికి సరిపోయేలా సిద్ధం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఓ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది.
అయితే త్రివిక్రమ్‌కు ఈ సినిమా అనుకున్నంత సులభంగా పట్టాలెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్‌తో గాడ్ ఆఫ్ వార్ అనే భారీ ప్రాజెక్ట్‌కు అనౌన్స్ చేశారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాల్సి ఉంది. మరోవైపు చిరంజీవి కూడా తన సినిమాల షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నారు. దీంతో చిరంజీవి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
అంతేకాకుండా ఎన్టీఆర్ సినిమా ముందు చిరంజీవి చిత్రం కానీ మొదలుపెడితే.. ఆ సినిమా ఫలితం కొంచెం తేడా కొట్టిన.. ఇంకా త్రివిక్రమ్ కు తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఉండదు. కాబట్టి ముందు జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ చేస్తారా.. లేకపోతే చిరంజీవి ప్రాజెక్ట్ చేస్తారా అని అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ప్రస్తుతం త్రివిక్రమ్ ఉన్న పరిస్థితిల్లో.. ఈ రెండు సినిమాల కూడా ఆయనకు అగ్ని పరీక్షలు లాగా మారాయి.
ముఖ్యంగా ‘ఆదర్శ కుటుంబం’ ఫలితం తర్వాత త్రివిక్రమ్‌పై అంచనాలతో పాటు ఒత్తిడి కూడా పెరిగింది. గతంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లతో విజయవంతమైన సినిమాలు అందించిన ఆయన, ఇప్పుడు మళ్లీ తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.