హైదరాబాద్‌లో వైఫ్ ఎక్స్‌ఛేంజ్ కల్చర్‌పై నటి సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మాధవీలత.
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మాధవీలత. సినీ పరిశ్రమలో లభించిన గుర్తింపుతో పాటు సామాజిక విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వార్తల్లో నిలిచే వ్యక్తిత్వంతో ఆకట్టుకున్నారు. నటనకు గుడ్ బై చెప్పిన తర్వాత మాధవీలత రాజకీయరంగ ప్రవేశం చేయడం.. బిజెపి తరఫున పోటీ చేసి తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లడం.. వినోద పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సినిమా కెరీర్ విషయానికి వస్తే.. మాధవీలత దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం `నచ్చావులే` ద్వారా టాలీవుడ్‌కి కథానాయికగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే నటిగా మంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత నాని సరసన `స్నేహితుడా`, అలాగే స్నేహగీతం, అరవింద్ 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కొద్దికాలానికే నటనకు స్వస్తి చెప్పిన మాధవి రాజకీయాల్లోకి అడుగుపెట్టి బిజెపి పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా మాధవీలత సమకాలీన సామాజిక అంశాలపైనా.. సమాజంలో జరుగుతున్న పరిణామాలపైనా కచ్ఛితత్వంతో మాట్లాడుతున్నారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన విషయాలు తీవ్ర సంచలనం సృష్టించాయి. నగరాల్లో మారుతున్న సంస్కృతి, ప్రైవేట్ పార్టీలపై మాధవీలత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం గెస్ట్ హౌస్‌లు అంటే ఎక్కడో ఊరికి దూరంగా ఉండేవి కావు అని..వ్యక్తులు తాము నివసించే సొంత రెసిడెన్షియల్ కమ్యూనిటీలలోనే లేదా పక్క వీధిలోనే మరో ఇల్లు కొనుక్కుని రహస్యంగా ప్రైవేట్ పార్టీలను నిర్వహిస్తున్నారని తెలిపారు.
అంతేకాకుండా.. హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరిగిపోతున్న వైఫ్ ఎక్స్చేంజ్ సంస్కృతి గురించి కూడా మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా విపరీత సంస్కృతి గురించి తాను దాదాపు 15 సంవత్సరాల నుంచే వింటున్నానని పేర్కొన్నారు. గతంలో సోషల్ మీడియా ప్రభావం లేకపోవడం వల్ల ఇటువంటి విషయాలు బయటకు రాలేదని...కానీ ఇప్పుడు ఈ సంస్కృతి మరింతగా వెలుగులోకి వస్తోందని... సమాజానికి ఇది ఏమాత్రం మంచిది కాదని మాధవీలత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్ద నగరాల్లో ఈ రకమైన కల్చర్ ఒక మహమ్మారిలా విస్తరిస్తోందని.. దీనిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అమలు చేసినట్లుగా నైట్ లైఫ్‌పై కఠినమైన నిబంధనలు విధించడం లేదా బ్యాన్ చేయడం వంటి చర్యలు చేపడితే తప్ప ఇటువంటి అనైతిక కార్యకలాపాలు నియంత్రణలోకి రావని వ్యాఖ్యానించారు. నటిగా, రాజకీయ నాయకురాలిగా సమాజంలోని ప్రతికూల ధోరణులపై మాధవీలత స్పందించిన తీరు మళ్లీ తనను వార్తల్లో నిలిపింది. సమాజంలో చెడు గురించి మాట్లాడే ధైర్యం అందరికీ ఉండదు. మాధవీలత ప్రయత్నానికి నెటిజనుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.