ఒక పడవ కొనుక్కుని దుబాయ్‌లో దాచిన హీరో
భారతదేశంలోని దిగ్గజ నటులలో ఆర్.మాధవన్ ఒకరు. దశాబ్ధాలుగా అతడి క్లాసీ పెర్ఫామెన్సెస్ ప్రజల హృదయాలను గెలుచుకుంటూనే ఉన్నాయి;
భారతదేశంలోని దిగ్గజ నటులలో ఆర్.మాధవన్ ఒకరు. దశాబ్ధాలుగా అతడి క్లాసీ పెర్ఫామెన్సెస్ ప్రజల హృదయాలను గెలుచుకుంటూనే ఉన్నాయి. బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోటై, అటుపై భారతదేశంలో దిగ్గజ నటుడిగా ఎదిగిన ఆర్.మాధవన్ ఆరంభంలో కొన్నేళ్ల పాటు స్టాండ్ బై కోసం శ్రమించినా, ఆ తర్వాత ఎదురే లేని నటుడిగా ఎదిగాడు. జాతీయ ఉత్తమ నటుడిగాను పురస్కారం అందుకున్న మేటి నటుడు అతడు.
అందుకే ఆర్ మాధవన్ ఏం చేసినా అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మాధవన్ తన జీవితంలో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు ఏదో ఇప్పుడు చెప్పుకొచ్చాడు. అది ఒక పడవ. కరేబియన్‌లో 75 అడుగుల భారీ లగ్జరీ పడవ కానే కాదు .. కేవలం ఒక చిన్న పడవ. అయినా కానీ, అది తనకు గొప్ప సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి తాను అస్సలు సిగ్గుపడలేదని, కొనుగోలు చేసాక దానిని దుబాయ్‌లోనే ఉంచానని చెప్పాడు.
ఇటీవల మాధవన్ దుబాయ్‌లో నివసిస్తున్నాడు. అక్కడ ఒక పడవ యజమానిగా గర్వంగా ఉన్నాడు. ఓ ఇంటర్వ్యూలో, నటులు ఆర్థిక భద్రత కోసం వారి నటనా వృత్తిపై మాత్రమే ఆధారపడకుండా విభిన్న పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్థావించారు. సినీరంగంలో కోరుకునే కెరీర్‌ను అనుసరించాలనుకుంటే ముందు ఆర్థిక భద్రత ఉండాలి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి ఆర్థికంగా సహకారంగా ఉంటుంది. ఎలాంటి డౌట్ లేకుండా పెట్టుబడి పెట్టొచ్చు.. అని ఆయన అన్నారు. తన సంపాదనలో చాలా భాగాన్ని దుబాయ్ లో ఆస్తులు పెంచుకోవడానికి మాధవన్ వెచ్చిస్తున్నాడు. అక్కడ సొంత ఇంటిని కలిగి ఉన్నాడు. సొంత పడవ కూడా అతడికి ఉంది.