సమంతకు మల్టీప్లెక్స్ ఓకే.. సింగిల్ స్క్రీన్స్ సంగతేంటి?

ప్రస్తుత అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో సమంత క్రేజ్ బాగానే పనిచేస్తున్నట్లు అర్థమవుతోంది.

Update: 2026-06-17 06:04 GMT

సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఒకే రోజులో ఏకంగా నలభై ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆమె సక్సెస్ అయింది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ భారీ ప్రమోషన్స్ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి బజ్ క్రియేట్ అయింది. రెండు రోజుల ముందుగానే టికెట్ సేల్స్ మొదలవడంతో ప్రస్తుత ఆడియన్స్ స్పందన ఎలా ఉందో ఒక క్లారిటీ వస్తోంది.

ప్రస్తుత అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో సమంత క్రేజ్ బాగానే పనిచేస్తున్నట్లు అర్థమవుతోంది. మల్టీప్లెక్స్ లోని ఎర్లీ మార్నింగ్ షోలకు సంబంధించి టికెట్లు ఫాస్ట్ గా అమ్ముడవుతూ దాదాపు అన్నీ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఒక మంచి ఫ్యామిలీ యాక్షన్ కామెడీ కథతో వస్తుండటంతో అర్బన్ ఆడియన్స్ సినిమా చూడటానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్ ఇందులో ఉందనే నమ్మకం బుకింగ్స్ చూస్తుంటే అర్ధమవుతుంది.

కానీ అసలు సమస్య అంతా సింగిల్ స్క్రీన్స్ దగ్గరకు వచ్చేసరికి మొదలైంది. ఇక్కడ పరిస్థితి మల్టీప్లెక్స్ కు పూర్తిగా భిన్నంగా ఉంది. మెయిన్ మాస్ సెంటర్స్ లో మా ఇంటి బంగారం సినిమాకు ఆశించిన స్థాయిలో టికెట్లు తెగడం లేదు. సింగిల్ స్క్రీన్స్ లో బుకింగ్స్ చాలా డల్ గా సాగుతున్నాయి. ప్రమోషన్స్ గట్టిగానే చేసినా మాస్ జనాలకు సినిమా ఇంకా పూర్తి స్థాయిలో కనెక్ట్ అయినట్లు లేదు. ఇక సినిమా రిలీజ్ రోజున థియేటర్లకు వచ్చి టిక్కెట్లు కొంటేనే సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి మెరుగుపడుతుంది.

అయితే కేవలం ఎర్లీ మార్నింగ్ షోలు ఫుల్ అయితేనే సినిమా కమర్షియల్ గా హిట్ అయినట్లు కాదు. ఉదయం ఆటలతో పాటు మధ్యాహ్నం, రాత్రి ఆటలకు కూడా మల్టీప్లెక్స్ లో కచ్చితంగా జనాలు కంటిన్యూ అవ్వాలి. మార్నింగ్ షో టాక్ మీదనే ఆ తర్వాత షోల కలెక్షన్స్ పూర్తిగా ఆధారపడి ఉంటాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోతే మధ్యాహ్నం ఆటల నుంచి మల్టీప్లెక్స్ థియేటర్లలో కూడా ఆక్యుపెన్సీ డ్రాప్స్ కనిపించే ప్రమాదం ఉంది.

బాక్సాఫీస్ దగ్గర సమంతకు ఇప్పుడున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలాంటి గట్టి పోటీ లేకపోవడం. మరోవైపు అఖిల్ లెనిన్ సినిమా జూలై 10కి షిఫ్ట్ అవ్వడంతో మా ఇంటి బంగారం సినిమాకు ఏకంగా రెండు వారాల పాటు సోలో రన్ దొరికింది. ఫోకస్ మొత్తం సామ్ పైనే ఉంటుంది. మొదటి రోజు మౌత్ టాక్ బాగుంటే చాలు సింగిల్ స్క్రీన్స్ లో కూడా టిక్కెట్లు తెగుతాయు. రెండు వారాల ఫ్రీ విండోలో ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు దక్కించుకునే అవకాశం ఉంది.

ఏ సినిమాకైనా బడ్జెట్ తిరిగి రావాలంటే కేవలం ఒక వర్గం ఆడియన్స్ చూస్తే ఏమాత్రం సరిపోదు. ప్రమోషన్స్ తో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను లాగడంలో సక్సెస్ అయినా లాంగ్ రన్ లో సింగిల్ స్క్రీన్స్ కూడా కచ్చితంగా నిలబడాలి. కంటెంట్ లో దమ్ముంటే బి సి సెంటర్స్ జనాలకు కూడా ఈ ఫ్యామిలీ కామెడీ కనెక్ట్ అవుతుంది. ప్రమోషన్స్ కష్టం కలెక్షన్స్ గా మారుతుందా లేదా అనేది శుక్రవారం నాడు వచ్చే పబ్లిక్ టాక్ తో తేలిపోనుంది.

Tags:    

Similar News