చదువు లేదు..ఆర్దిక ఇబ్బందుల్లోనే పెరిగాను!
కళారంగంలో పోటీ అన్నది నటనాపరంగానే కాదు గాయనీ,గాయకుల మద్య కూడా తీవ్రమైన పోటీ ఉండేది.;
కళారంగంలో పోటీ అన్నది నటనాపరంగానే కాదు గాయనీ,గాయకుల మద్య కూడా తీవ్రమైన పోటీ ఉండేది. సుశీల-జానకి లాంటి లెజెండరీ గాయనీమణులతో పోటీ అంటే చిన్న విషయం కాదు. వాళ్లను దాటుకుని కొత్త వాళ్లకు అవకాశాలు రావడం అన్నది అంత సులభంగా జరిగేది కాదు. సరిగ్గా అలాంటి సమయంలోనే ఎల్.ఆర్ ఈశ్వరీ కూడా గాయకురాలిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.
స్వరంలో కొత్తదనం పరిచయం చేసిన ఘనత ఈశ్వరి సొంతం. ఆమె గాత్రంతో శ్రోతలకు సరికొత్త అనుభూతిన పంచిన ఘతన ఈశ్వరికే చెల్లింది. సుశీల-జానకి ఓ తరహా గాయనీమణులుగా రాజ్యమే లుతుంటే? ఎల్. ఆర్ ఈశ్వరీ మాత్రం పాటలతో తనదైన ప్రత్యేకత చాటారు. 1958లోనే ఈశ్వరిని గాయని గా కేవీ మహాదేవ్ పరిచయం చేసారు. కానీ ఆమె 1960 రిలీజ్ అయిన 'పాశమలార్' గాయనిగా ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది.
అటుపై తెలుగులో విజయలలిత .. జ్యోతిలక్ష్మి .. జయమాలిని వంటి వారికి ఎక్కువగా గాత్రాన్ని అందించా రు. అలా మొదలైన ఈశ్వరి ప్రస్తానం సౌత్ ఇండస్ట్రీలో అజేయంగా కొనసాగింది. తెలుగు, తమిళం, మలయా ళం, కన్నడం అన్ని భాషల్లోనూ ఆలపించి లెజెండరీ గాయనిగా ఎదిగారు. తాజాగా ఆమె మరోసారి ఆమె గతాన్ని తలుచుకుకున్నారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే... `చిన్నతనంలో నాన్న చనిపోయారు.
అమ్మ,నేను, తమ్ముడు. ఇదే మా కుటుంబం. అమ్మ కోరస్ పాడుతుండేది. అందువల్ల నాకు తెలియ కుండానే పాటలపై చిన్నప్పుడే ఆసక్తి మొదలైంది. బాగా చదుకోవాలని ఉండేది. కానీ అందుకు నా అర్దిక పరిస్థితులు సహకరించలేదు. అలా చదువుకు దూరమ్యాను. ఆర్దిక ఇబ్బందుల్లోనే పెరిగాను. సినిమాల్లో పాడే సమయానికి నా వయసు 17 ఏళ్లు. ఎన్టీఆర్ గారి సినిమాలకు ఎక్కువగా పాటలు పాడాను.
రిహార్సల్స్ సమయంలో రామారావు గారు వచ్చేవారు. ఆయనే నా వాయిస్ బాగుందని ప్రశంసించేవారు. ఆ విషయంలో నేను ఎంతో అదృష్టవంతురాలిని. గాయనిగా నా ప్రతిభను మాత్రమే నమ్ముకుని ప్రయాణం కొనసాగించి సక్సెస్ అయ్యాను. నన్ను ప్రత్యేకంగా ప్రోత్సహించిన వాళ్లు అంట ఇండస్ట్రీలో ఎవరూ లేరు. ఐదు భాషలలో గాయనిగా మంచి పేరుంది. అదే నాకు ఎంతో సంతృప్తినిస్తుంది` అన్నారు.