• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రెండీ టాక్:...

ట్రెండీ టాక్: న‌ట‌వార‌సుడిలో ఎక్క‌డుంది లోపం?

| కానీ నాలుగు రోజుల‌కే క‌లెక్ష‌న్లు లేక‌ చాప చుట్టేసాయ‌ని బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించింది.

By - Tupaki Desk
Update: 2025-02-12 16:30 GMT

సోమ‌వారం టెస్ట్ లో ఘోరంగా విఫలమైన తర్వాత, జునైద్ ఖాన్ - ఖుషి కపూర్ ల లవ్‌యాపా , హిమేష్ రేషమ్మియా నటించిన బాదాస్ రవి కుమార్ రెండూ మంగళవారం కలెక్షన్లలో మరింత తగ్గుదలను చ‌విచూశాయి. రెండు సినిమాలు ఒకే రోజు అంటే ఫిబ్రవరి 7న విడుదలయ్యాయి. కానీ నాలుగు రోజుల‌కే క‌లెక్ష‌న్లు లేక‌ చాప చుట్టేసాయ‌ని బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించింది.

అయితే ల‌వ్ యాపా న‌టులు ఇప్ప‌టికీ ప్ర‌చారం కోసం త‌పిస్తున్నారు. తాజాగా ఇంట‌ర్నెట్ లో ఫరా ఖాన్ - జునైద్ ఖాన్ ల వీడియో ఒక‌టి వైరల్ అవుతోంది. లవ్‌యాపా ప్రచారంలో భాగంగా జునైద్ తో క‌లిసి వెళ్లిన ఫ‌రా తన ఇంటి పనిమనిషితో ప‌రాచికం ఆడిన వీడియో క‌డుపుబ్బా న‌వ్వించింది. జునైద్ ని చూడ‌గానే ``ఎవరు ఇది? అని సందేహించ‌డం... ఆమిర్ కొడుకు చాలా పొట్టివాడు! అనే ప‌రిహాసంతో క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. వారి మ‌ధ్య స‌ర‌దా ప‌రిహాసం అంద‌రినీ చిలౌట్ చేసింది. నిజానికి అమీర్ ఖాన్ పొట్టి. కాబ‌ట్టి అత‌డి వార‌సుడు కూడా పొట్టిగా ఉండాల‌ని చాలా మంది భావిస్తారు. కానీ జునైద్ చాలా ఎత్తు. ఇక్క‌డ‌ జునైద్ ఒడ్డూ పొడుగూ మ్యాట‌ర్ కాదు. అత‌డు న‌టించిన రొమాంటిక్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపైంది. అత‌డు ప్ర‌జ‌ల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించేంత పెద్ద స్టార్ కాలేక‌పోయాడు. అత‌డు ఆశించిన‌ది సాధించాలి అంటే చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంటుంది.

ఒక పెద్ద స్టార్ న‌ట‌వార‌సుడు వ‌స్తున్నాడు! అనే క్యూరియాసిటీ ప్ర‌జ‌ల్లో లేక‌పోవ‌డం కూడా జునైద్ కి పెద్ద‌ మైన‌స్. అలాగే పెద్ద సూప‌ర్ స్టార్ వార‌సుడు కాబ‌ట్టి జునైద్ ఎవ‌రికీ అంతు చిక్క‌ని వాడు కాదు. అతడు చాలా సాధా సీదా బోయ్ లా ఉన్నాడు. అంద‌రితో క‌లిసిపోయే మ‌న‌స్త‌త్వం అత‌డిని స్వీటెస్ట్ బోయ్ గా చూపిస్తోంది. అయితే ఇండ‌స్ట్రీకి కావాల్సింది స్వీటెస్ట్ కాదు.. బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ తో దుమారం రేపే హాటెస్ట్ గ‌య్ అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బాలీవుడ్ లో అత‌డు హృతిక్ రోష‌న్, ర‌ణ్ వీర్ ల‌తో పోటీప‌డ‌టం అంత సులువు కాదు. క‌నీసం అత‌డు వైవిధ్య‌మైన సినిమాల‌తో ఇత‌రుల కంటే తాను ఎలా బెస్ట్ అనేది నిరూపించాల్సి ఉంటుంది. కంటెంట్ అత‌డిని కింగ్ గా మార్చ‌గ‌ల‌ద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. అమీర్ ఖాన్, ఫ‌రాఖాన్ స‌హా చాలా మంది సెల‌బ్రిటీలు ప్ర‌చారం చేసినా కానీ, ల‌వ్ యాపా విజ‌యం సాధించ‌లేదు.


The way Farah Khan Stopped him is killing me 🤣🤣🤣🤣 pic.twitter.com/uS1kcx5jju

— Why So Serious! 🍉 (@SurrealZack) February 9, 2025


Tags:    
  • JunaidKhan 
  • KhushiKapoor 
  • Loveyappa 
  • Boxofficefailure 
  • FarahKhan 
  • Viralvideo 
  • Bollywood 
  • Romanticmovie 
  • AmirKhan 
  • BoxOfficeCollections 
  • Celebritypromotions 
  • Filmstruggles 
  • Bollywoodmedia 
  • Moviepromotion 
  • Audienceresponse 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS