గుద్దుకోవ‌డానికి రెడీ అవుతోన్న స్టార్లు!

స్టార్ హీరోలిద్ద‌రు వార్ కి సిద్ద‌మ‌వుత‌న్నారా? బాక్సాఫీస్ వ‌ద్ద ఒకే రోజు ఢీ కొట్ట‌బోతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.;

Update: 2025-09-08 12:19 GMT

స్టార్ హీరోలిద్ద‌రు వార్ కి సిద్ద‌మ‌వుత‌న్నారా? బాక్సాఫీస్ వ‌ద్ద ఒకే రోజు ఢీ కొట్ట‌బోతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. బాలీవుడ్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా `ల‌వ్ అండ్ వార్` తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. విక్కీ కౌశ‌ల్, అలియాభ‌ట్ లాంటి స్టార్ల‌తో రూపొందుతున్న చిత్ర‌మిది. ఈ సినిమా లాంచింగ్ డే రోజునే ఈద్ సంద‌ర్భంగా 2026 మార్చి 20న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ దిశ‌గానే షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది.

నాలుగేళ్ల గ్యాప్ అనంత‌రం

భ‌న్సాలీ నుంచి రాబోతున్న మ‌రో క‌ళాఖండంగా నెట్టింట వైర‌ల్ అవుతోన్న చిత్ర‌మిది. `గంగూబాయి క‌తియావాడి` త‌ర్వాత భ‌న్సాలీ నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చి మ‌రీ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. గ‌త ఏడాది రిలీజ్ అయిన టెలివిజ‌న్ సిరీస్ `హీరామండి` కూడా మంచి విజ‌యం సాధించింది. భ‌న్సాలీ గ‌త ట్రాక్ రికార్డ్ స‌హా అన్ని ల‌వ్ అండ్ వార్ పై అంత‌కంత‌కు అంచ‌నాలు పెంచేస్తున్నాయి. సినిమా భారీ విజ‌యం సాధిస్తుం దని ట్రేఊడ్ సైతం అంచ‌నా వేస్తోంది. ఈద్ హాలీడే ని టార్గెట్ చేసుకుని రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది.

షూటింగ్ పూర్తి చేసిన ధ‌మాల్-4

ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ తేదీకి రిలీజ్ కు ఉన్న‌ది బాలీవుడ్ నుంచి ఈ ఒక్క చిత్ర‌మే కావ‌డంతో? పోటీ కూడా లేదనుకున్నారంతా. కానీ స‌రిగ్గా అదే రోజున బాలీవుడ్ నుంచి మ‌రో హీరో కూడా రంగంలోకి దిగుతున్నాడు. అతడే అజ‌య్ దేవ‌గ‌ణ్. ఆయ‌న క‌థానాయకుడిగా `ధ‌మాల్` ప్రాంచైజీ నుంచి 4వ ఇన్ స్టాల్ మెంట్ కూడా ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. రితీష్ దేశ్ ముఖ్, సంజ‌య్ మిశ్రా, అర్ష‌ద్ వార్షీ లాంటి స్టార్లు భాగ‌మ‌వు తోన్న చిత్ర‌మిది. ఇంద్ర కుమార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

ఇంకా కొత్త చిత్రాల‌కు ఛాన్స్:

అయితే ఇంత వ‌ర‌కూ ఈ సినిమా రిలీజ్ ని ప్ర‌క‌టించ‌లేదు. మార్చి త‌ర్వాతే రిలీజ్ ఉంటుంద‌ని అంతా భావిస్తున్నారు. ఈనేప‌థ్యంలో అనూహ్యంగా ఈద్ కే ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో పోటీలేకుండా రిలీజ్ అవుతోన్న ల‌వ్ అండ్ వార్ కు పోటీగా `ధ‌మాల్ 4` నిలిచింది. ఈ నేప‌థ్యంలో రెండు సినిమాల మ‌ధ్య బాక్సాఫీస్ పోరు షురూ అయింది. ఇంకా ఐదారు నెల‌లు స‌మ‌యం ఉన్న త‌రుణంలో ఈ వార్ లోకి ఇంకేవైనా కొత్త చిత్రాలు దిగుతాయా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News