సంజయ్ లీలా భన్సాలీ కోసం కేజీలు కరిగించేస్తున్నారు!
ఆయన నుంచి సినిమా వస్తోందంటే చర్చజరుగుతూ వుంటుంది. ఇప్పుడు మరో సారి ఆయన నెక్స్ట్ మూవీ 'లవ్ అండ్ వార్'పైజరుగుతోంది.;
సంజయ్ లీలా భన్సాలీ.. ఇండియన్ సినిమాల్లో ది గ్రేట్ మేకర్‌గా మంచి పేరున్న దర్శకుడు. చారిత్రాత్మక చిత్రాలకు అథెంటిక్‌గా సెట్స్ వేయించడంలోనూ, క్యారెక్టర్ల పరంగా డ్రెస్ మెటీరియల్స్‌తో పాటు వాస్తవికతని కళ్లకు కట్టినట్టు చూపిస్తూ క్యారెక్టర్లని అంతే బలంగా మలచి వెండితెరని ఓ అద్భుతమైన క్యాన్వాస్‌గా మలచడంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీది ప్రత్యేక శైలి. కెరీర్‌లో ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఎదురు చూడని హీరో ఉండరంటే అతిశయోక్తితి కాదు.
ఆయన నుంచి సినిమా వస్తోందంటే చర్చజరుగుతూ వుంటుంది. ఇప్పుడు మరో సారి ఆయన నెక్స్ట్ మూవీ 'లవ్ అండ్ వార్'పైజరుగుతోంది. 'గంగూబాయి కతియావాడి' తరువాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న భారీ వార్ అండ్ లవ్ డ్రామా 'లవ్ అండ్ వార్'. ఇందులోని కీలక పాత్రల్లో రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌషల్, అలియాభట్ నటిస్తున్నారు. ఇందులో వీరితో పాటు సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు కీలక నటీనటులు నటించబోతున్నారు. దీపికా పదుకునే కీలక అతిథి పాత్రలో కనిపించనుండగా, నయనతార కూడా అతిథిగా ఇందులో మెరవనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సత్యరాజ్, బోమన్ ఇరానీ, భాగ్యశ్రీ, మురళీశర్మ, మైనీరాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్ అఫ్లెక్ 'పెరల్ హార్బర్' స్పూర్తితో ఈ సినిమాని సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కరిస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. ఈ మూవీకి డైరెక్షన్‌తో పాటు సంజయ్ లీలా భన్సాలీ రైటర్‌గా, నిర్మాతగా, ఎడిటర్‌గా, కంపోజర్‌గా అన్ని బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. తన ప్రతి సినిమా కోసం హీరోలని, హీరోయిన్‌లని ప్రత్యేకంగా చూపించే సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీ విషయంలో మాత్రం హీరోల మేకోవర్ కోసం హీరోలకు పెద్ద టాస్కే ఇచ్చారట.
బరువు తగ్లాలని హీరోలు రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌషన్‌లకు టాస్క్ ఇవ్వడంతో రణ్‌బీర్ కపూర్ 12 కేజీలు, విక్కీ కౌషన్ 15 కేజీలు బరువు తగ్గినట్టుగా తెలుస్తోంది. ఇందులో ఇద్దరు హీరోలు మిలటరీ ఆఫీసర్స్‌గా పవర్ ఫుల్ క్యారెక్టర్లలో కనిపించబోతున్నారు. దీని కోసమే ఇద్దరిని బరువు తగ్గమన్నారట. ఇటీవలే ఈ మూవీ షూటింట్ కూడా లాంఛనంగా మొదలు కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది.