అను మేడం ఎంత కష్టపడుతుందో చూడండి!

ఇద్దరు పిల్లలకు తల్లి అయి, వయసు పెరుగుతున్నా కూడా ఇంకా పాతికేళ్ల హాట్‌ హీరోయిన్ రేంజ్ లో అనసూయ అందంగా కనిపించడానికి కారణం ఏంటి అంటూ చాలా మంది అనుకుంటూ ఉంటారు.

Update: 2023-10-26 07:27 GMT

జబర్దస్త్‌ కామెడీ షో యాంకర్‌ గా చేయడం ద్వారా హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా ఎంత పాపులారిటీని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్‌ కారణంగా హీరోయిన్‌ గా కూడా అనసూయకు ఆఫర్ లు వచ్చాయి. ఇప్పటికి కూడా నటిగా ఫుల్ బిజీగా అనసూయ దూసుకు పోతుంది.

జబర్దస్త్‌ మానేసిన తర్వాత కొందరు అనసూయ ను విమర్శించారు. అయితే సినిమాల్లో పూర్తి సమయం ను కేటాయించే ఉద్దేశ్యంతో బుల్లి తెరకు దూరం అయింది. రెండు పడవల ప్రయాణం ఏమాత్రం సరికాదని ఆమె బుల్లి తెరను వీడినట్లు ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే సోషల్‌ మీడియా లో మాత్రం అనసూయ మేడం రెగ్యులర్ గా సందడి చేస్తూనే ఉంటారు.

నటిగా ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఫోటోలు మరియు వీడియో లను షేర్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా తన జిమ్ వర్కౌట్ వీడియో ను షేర్ చేయడం జరిగింది. దసరా శుభాకాంక్షలు చెబుతూ, తనకు సోషల్ మీడియా లో వచ్చే నెగటివ్ ట్రోల్స్ మరియు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఇతరులను పట్టించుకోకుండా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే మంచి మెసేజ్ ను అనసూయ ఇచ్చింది.

ఇద్దరు పిల్లలకు తల్లి అయి, వయసు పెరుగుతున్నా కూడా ఇంకా పాతికేళ్ల హాట్‌ హీరోయిన్ రేంజ్ లో అనసూయ అందంగా కనిపించడానికి కారణం ఏంటి అంటూ చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ వీడియో చూస్తే వారికే క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంతగా అనసూయ కష్టపడుతూ ఉంది కనునే ఈ రేంజ్ లో అందంగా ఉందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

Read more!

అనసూయ ఒక వైపు పెద్ద సినిమా ల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా, విలన్ గా నటిస్తూనే మరో వైపు చిన్న సినిమా ల్లో మంచి పాత్ర ల్లో నటిస్తూ తన అభిమానులను మరియు ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. తాజాగా మరోసారి ఈ వీడియో ద్వారా అనసూయ తాను ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఎంత కష్టపడుతుందో చెప్పకనే చెప్పింది.

Tags:    

Similar News