లోకేష్ వాల్యుబుల్ మిస్టేక్..?
కాస్త క్రేజ్ రాగానే ఆడియన్స్ ని తక్కువ అంచనా వేస్తుంటారు డైరెక్టర్స్. ఒకటి రెండు హిట్లు పడితే ఆ మాత్రం కాన్ఫిడెన్స్ కామనే.;
కాస్త క్రేజ్ రాగానే ఆడియన్స్ ని తక్కువ అంచనా వేస్తుంటారు డైరెక్టర్స్. ఒకటి రెండు హిట్లు పడితే ఆ మాత్రం కాన్ఫిడెన్స్ కామనే. కానీ సినిమా.. ఆడియన్స్.. ఈ రెండినీ ఎప్పుడు గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. సినిమా చూసే ఆడియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. అతనికి ఇలా కథ చెబితే ఓకేనా అన్నది చెప్పడం కష్టం. కానీ ఏముందిలే ఆడియన్స్ కి ఈమాత్రం సరిపోద్ది అనే ఆలోచన వస్తే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ప్రెజంట్ కొందరు డైరెక్టర్స్ అలాంటి మిస్టేక్స్ చేస్తూ తప్పు జరిగాక అదేంటని తెలుసుకుంటారు.
మానగరం తో డైరెక్టర్..
ఈ లిస్ట్ లో కొత్తగా జాయిన్ అయ్యాడు తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్. మానగరం తో డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్న అతను ఖైదీ, విక్రం రెండు సినిమాలతో ఎల్.సి.యు అంటూ ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. అఫ్కోర్స్ ఆ రెండు సినిమాలు చూస్తే అతనికి క్రెడిట్స్ ఇచ్చేయాలని అనిపించేలా ఉన్నాయి. కానీ మధ్యలో మాస్టర్, లియో సినిమాలు మళ్లీ అతని గ్రాఫ్ పడిపోయేలా చేశాయి.
ఐతే లియో షాక్ ఇచ్చినా సరే కూలీతో మళ్లీ అదే తప్పు చేశాడు లోకేష్ కనకరాజ్. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ సినిమా చేశాడు లోకేష్ కనకరాజ్. సినిమా రిలీజై వారం మాత్రమే. అప్పుడే బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. కూలీలో లోకేష్ కనకరాజ్ సినిమా మార్క్ కనిపించలేదు. భారీ స్టార్ కాస్ట్ తో ఏదో నడిపించేశాడనిపించింది. అసలు విలన్ గా నాగార్జునని అన్నిసార్లు కలిసి ఒప్పించాడని చెప్పాడు. అసలు ఆ రోల్ కి నాగార్జున ఎందుకో లోకేష్ అయినా ఆలోచించాల్సింది.
తమిళ సినిమాకు 1000 కోట్లు..
ఆ రోల్ చేసినందుకు ఇటు అక్కినేని ఫ్యాన్స్ కూడా నాగార్జున మీద అసంతృప్తిగా ఉన్నారు. లోకేష్ మాత్రం కూలీ సినిమాతో ఒక పెద్ద వాల్యుబుల్ మిస్టేక్ చేశాడు. స్టార్ కాస్ట్ ఉంది.. స్టోరీ.. స్క్రీన్ ప్లే ఎలా చేసినా వర్క్ అవుట్ అవుతుందని అనుకున్నాడు. కానీ ఆడియన్స్ చాలా క్లవర్ అన్న విషయాన్ని మర్చిపోయాడు. అందుకే అతనికి ఇవ్వాల్సిన షాక్ ఇచ్చారు. కూలీ రిలీజ్ ముందు నానా హంగామా చేశారు. తమిళ సినిమాకు 1000 కోట్లు తెచ్చే సినిమా అన్నారు. కానీ వారం లో 500 కోట్లు కూడా దాటలేదు ఈ సినిమా.
సినిమా మీద అంచనాలు ఓకే కానీ ఆ అంచనాలను మించి సినిమా ఉండాలి కానీ.. లోకేష్ సినిమా విషయంలో చేసిన మిస్టేక్స్ తో పాటు ఆడియన్స్ అతని పై పెట్టుకున్న భోరసా మూలంగానే ఈ సినిమా అలాంటి ఫలితం దక్కించుకుంది. మరి లోకేష్ నెక్స్ట్ సినిమాలకైనా ఈ మిస్టేక్స్ లేకుండా స్టార్ కాంబినేషన్స్ కన్నా గ్రిప్పింగ్ స్టోరీ ఉండాలని గుర్తిస్తే బెటర్.