అమీర్ ఖాన్ తో లోకేష్ తీసేది ఆ కథేనా!
సూపర్ స్టార్ రజనీకాంత్ తో లోకేష్ కనగరాజ్ ముందు తీయాలనుకున్న చిత్రం `కూలీ` కాదు.;
సూపర్ స్టార్ రజనీకాంత్ తో లోకేష్ కనగరాజ్ ముందు తీయాలనుకున్న చిత్రం `కూలీ` కాదు. ` కూలీ` కంటే ముందే ఓ సోషియో ఫాంటసీ కథను వినిపించాడు. దానికి భారీ బడ్జెట్ అవుతుంది. షూటింగ్ పూర్తి చేయ డానికి కూడా ఏడాదిన్నర సమయం పడుతుంది. ఇందులో రజనీకాంత్ రోల్ కూడా హీరో కాదు.. విలన్ గా. పూర్తిగా ప్రతి నాయకుడి పాత్రలోనే ఓ గొప్ప కథను చెప్పే స్క్రిప్ట్ ఇది. అయితే రజనీకాంత్ లాంటి స్టార్ ని పట్టుకుని ఏడాదిన్నర పాటు సినిమా చేయడం ఇష్టం లేక మళ్లీ ఆ సినిమా వద్దని `కూలీ` కథను పట్టా లెక్కించాడు.
మరి ఇప్పుడా పాత కథ ఎక్కడికి చేరినట్లు? అంటే ఓ ఆసక్తికర విషయం లీకైంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో సినిమా తీస్తానని లోకేష్ కనగరాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదెప్పుడు పట్టా లెక్కు తుంది? అన్నది చెప్పలేదు కానీ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని ఇద్దరు ధృవీ కరించారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కి వినిపించిన సోషియా ఫాంటసీ కథే అమీర్ వద్దకు చేరినట్లు తాజాగా వార్తలొ స్తున్నాయి. ఆ కథలో పాత్రకు అమీర్ పర్పెక్ట్ గా సూటవుతున్నాడుట.
దీనికి సంబంధించి ఇరువురు గెటప్స్ తో ఏఐ ద్వారా టెస్టింగ్ కూడా నిర్వహించారుట. రజనీకాంత్ కంటే కూడా అమీర్ అయితేనే పక్కాగా సెట్ అవుతున్నారుట. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థలోనే చేయాలనుకుంటున్నాడుట. బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని సమాచారం. 400 కోట్ల ప్రాజెక్ట్ గా తెరపైకి వస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. ఒకవేళ అంతా ఒకే అయినా ఈ ప్రాజెక్ట్ పట్టా లెక్కడానికి చాలా సమయం పడుతుంది.
ప్రస్తుతం అమీర్ ఖాన్ వివిధ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అలాగే మహాభారతం కు సంబంధించిన పను లు కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది మహాభారతం పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తు న్నారు. అటు లోకేష్ కూడా వేర్వేరు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఎల్ సీయూ నుంచి ఆయన పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి `ఖైదీ 2` షూటింగ్ మొదలవుతుంది. అనంతరం రోలెక్స్, విక్రమ్ 2 , లియో 2 లాంటి చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది.