• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రోలెక్స్‌ ట్విస్ట్ తో LCU...

రోలెక్స్‌ ట్విస్ట్ తో LCU ఫ్యాన్స్‌కి మరో ట్రీట్

| తమిళ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటైన ‘విక్రమ్‌’తో లోకేశ్ కనగరాజ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

By - Tupaki Desk
Update: 2024-10-18 09:33 GMT

తమిళ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటైన ‘విక్రమ్‌’తో లోకేశ్ కనగరాజ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగే సూర్య చేసిన ‘రోలెక్స్‌’ క్యారెక్టర్ కనిపించింది కొంత సేపే అయినా ప్రేక్షకులపై ఓ రేంజ్‌లో ఇంపాక్ట్ కలిగించింది. సినిమాలో క్లైమాక్స్‌ సీక్వెన్స్‌లో సూర్య చేసిన విలనిజం చాలా ప్రత్యేకంగా నిలిచింది. రోలెక్స్ పాత్రకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది.

అయితే పాత్ర చుట్టూ పూర్తి స్థాయి సినిమాను రూపొందిస్తానని లోకేశ్ కనగరాజ్ ఆ మధ్య హింట్ ఇచ్చారు. తాజాగా సూర్య కంగువా సినిమా ప్రమోషన్లలో రోలెక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. రోలెక్స్ సినిమాలో తన పాత్ర గతంలో చేసిన మరో సినిమా కథతో లింక్ ఉంటుందని తెలిపారు. ఆయన చెప్పినట్టుగా ‘1986లో విడుదలైన ‘విక్రమ్‌’కూ 2022లో వచ్చిన ‘విక్రమ్‌’కి లింక్ ఉన్నట్లే, ‘రోలెక్స్’ సినిమాకు తాను చేసిన ఓ చిత్రంతో కనెక్షన్ ఉంటుంది’’ అని చెప్పారు.

దీంతో ఎల్‌సీయూ (లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) ఫ్యాన్స్ ఆ సినిమా కోసం క్యూరియస్‌గా ఎదురు చూస్తున్నారు. సూర్య నటించిన తాజా చిత్రం ‘కంగువా’ నవంబర్ 14న విడుదల కాబోతుంది. దర్శకుడు శివ ఈ సినిమాను పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కించారు. ఇందులో సూర్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపిస్తారని సమాచారం.

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా సూర్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ, రోలెక్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. సూర్య ప్రస్తుతం దిశా పటానీ, బాబీ దేవోల్‌తో కలిసి నటించిన ఈ సినిమాను దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ‘కూలీ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘కూలీ’ పూర్తయిన తర్వాత రోలెక్స్‌ పాత్రను ఆధారంగా చేసుకొని స్టాండలోన్ మూవీ చేయనున్నట్లు లోకేశ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

అలాగే రోలెక్స్ పాత్రకు వచ్చిన ఫ్యాన్ క్రేజ్‌ని పరిగణలోకి తీసుకుని LCUలోని అన్ని హీరోలను కలిపి పీక్ మూవీని ప్లాన్ చేయాలనుకుంటున్నట్లు అన్నారు. ఒకరకంగా ‘విక్రమ్‌’, ‘ఖైదీ’, ‘రోలెక్స్‌’ సినిమాల లింక్‌లో ఉన్న అన్ని పాత్రలను కలిపేలా ఎల్‌సీయూ పీక్ మూవీగా ఉండేలా చూస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కమల్ హాసన్, కార్తీ, విజయ్ సేతుపతి వంటి స్టార్లతో కలిసి మరింత పెద్ద సినిమాను తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నట్లు లోకేశ్ చెప్పారు.

Tags:    
  • Suriya 
  • Kanguvamovie 
  • Rolexmovie 
  • Lokeshkanagaraj 
  • Lokeshcinematicuniverse 
  • Filmindustry 
  • Vikrammovie 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS