• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  LCU - ఇలాంటి హీరో దిగితే...

LCU - ఇలాంటి హీరో దిగితే 2 వేల కోట్లు పక్కా..?

| సౌత్ ఇండియాలో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ దర్శకుల జాబితాలో లోకేష్ కనగరాజ్ పేరు కూడా వినిపిస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-11-12 05:30 GMT

సౌత్ ఇండియాలో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ దర్శకుల జాబితాలో లోకేష్ కనగరాజ్ పేరు కూడా వినిపిస్తుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో మూవీస్ చేస్తోన్న లోకేష్ కనగరాజ్ వరుస సక్సెస్ లు అందుకుంటున్నారు. చివరిగా లోకేష్ నుంచి వచ్చిన ‘లియో’ మూవీ 600 కోట్లకి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకొని కూడా భారీ వసూళ్లు సాధించడం విశేషం. ఇదిలా ఉంటే లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కూలీ’ మూవీ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది మిడ్ లో ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే లోకేష్ కనగరాజ్ లైన్ అప్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. ప్రభాస్ తో భారీ బడ్జెట్ మూవీ చేస్తానని ఇప్పటికే లోకేష్ ప్రకటించాడు. ఆల్రెడీ స్టోరీ నేరేషన్ కూడా ఇచ్చాడని టాక్ నడుస్తోంది. ఇండియాలోనే బిగ్ బడ్జెట్ మూవీగా ఈ చిత్రం మారే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు.

ఇదిలా ఉంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని ‘ఖైదీ’ సినిమాతో లోకేష్ కనగరాజ్ స్టార్ట్ చేశారు. ఇందులో ‘ఖైదీ’ తర్వాత ‘విక్రమ్’, ‘లియో’ మూవీస్ చేశాడు. నెక్స్ట్ ‘ఖైదీ 2’ స్టార్ట్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అలాగే ‘విక్రమ్ 2’ కూడా ఉంటుందని చెప్పాడు. దీంతో పాటు విక్రమ్ లో సూర్య చేసిన ‘రోలెక్స్’ క్యారెక్టర్ తో ఒక పవర్ ఫుల్ కథని సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఇలా లోకేష్ లైన్ అప్ లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో లోకేష్ కనగరాజ్ సినిమా కన్ఫర్మ్ అయ్యిందంట.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా నిర్మాత, హీరో, డైరెక్టర్ మధ్య ఈ ప్రాజెక్ట్ చర్చలు జరిగాయని టాక్. త్వరలో అఫీషియల్ గా దీనిపై ప్రకటన చేయొచ్చని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా 2026లో మొదలయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అమీర్ ఖాన్ ప్రస్తుతం ‘సితారే జమీన్ పర్’ మూవీ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

ఈ లోపు లోకేష్ కూలీ సినిమా కంప్లీట్ చేస్తాడు. ఆ తరువాత అమీర్ ఖాన్ తో సినిమా స్టార్ట్ చేయొచ్చని అనుకుంటున్నారు. ఒక వేళ ఈ సినిమా పట్టాలెక్కితే మాత్రం కచ్చితంగా 2000 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ‘దంగల్’ సినిమాతో అమీర్ ఖాన్ ఇప్పటికే 2000 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరాడు. ఈ నెంబర్ ని ఇప్పటి వరకు ఎవరూ బీట్ చేయలేదు. లోకేష్ తో అమీర్ చేయబోయే మూవీతో ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కూలీ’ మూవీలో కూడా అమీర్ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Tags:    
  • Aamirkhan 
  • Bollywood 
  • Lokeshkanagaraj 
  • Mythrimoviemakers 
  • Coolie 
  • Rajinikanth 
  • Kollywood 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS