లోకా మూవీ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

మాలీవుడ్ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో రూపొందిన మూవీ లోకా చాప్టర్ 1 చంద్ర. సూపర్ హీరో జోనర్ లో రూపొందిన ఆ మూవీలో ప్రేమలు హీరో నస్లేన్ కీలక పాత్రలో నటించారు.;

Update: 2025-08-28 13:53 GMT

మాలీవుడ్ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో రూపొందిన మూవీ లోకా చాప్టర్ 1 చంద్ర. సూపర్ హీరో జోనర్ లో రూపొందిన ఆ మూవీలో ప్రేమలు హీరో నస్లేన్ కీలక పాత్రలో నటించారు. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వేఫరార్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఆ సినిమాకు డామ్నిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.

డొమినిక్ అరుణ్ రచయితగా కూడా వ్యవహరించిన లోకా మూవీకి శాంతి బాలచంద్రన్ అదనపు స్క్రీన్ ప్లే అందించారు. ఇంటర్నేషనల్ స్టంట్ ఎక్స్పర్ట్ యానిక్ బెని వర్క్ చేయడం విశేషం. జేక్స్ బెజోయ్ సంగీతం అందించగా.. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు. అయితే నేడు మలయాళంలో రిలీజైంది మూవీ.

ఆగస్టు 29వ తేదీన తెలుగులో కొత్త లోక 1: చంద్ర పేరుతో విడుదల కానుంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ ను కూడా మేకర్స్ రీసెంట్ గా విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

భారతీయ సంస్కృతి, జానపదాలు, పురాణాల్లో పాతుకుపోయిన ఒక సాహసోపేతమైన కొత్త సినిమాటిక్ యూనివర్స్ ఎక్స్పీరియన్స్ ను సినిమా అందించనుందని అర్థమవుతున్నట్లు ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పురాణాలను మోడ్రన్ యాక్షన్‌ తో మిళితం చేసిన దృశ్యకావ్యంలా సినిమాగా ఉంటుందని చెబుతున్నారు.

అదే సమయంలో మాలీవుడ్ ఆడియన్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు రివ్యూస్ ఇస్తున్నారు. సినిమా అదిరిపోయిందని చెబుతున్నారు. కల్యాణి ప్రియదర్శన్ యాక్షన్ తో అదరగొట్టారని అంటున్నారు. ప్రతి సీన్ లో కూడా తన యాక్టింగ్ తో అలరించారని అంటున్నారు. సినిమా అంతా విజువల్ క్వాలిటీ సూపర్ గా ఉందని చెబుతున్నారు.

జేక్స్ బిజోయ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అంటున్నారు. టాప్ నాచ్ ఫిల్మ్ అని చెబుతున్నారు. మస్ట్ వాచబుల్ మూవీ అని కామెంట్లు పెడుతున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయని కొనియాడుతున్నారు. డామ్నిక్ అరుణ్ డైరెక్షన్ చాలా బాగుందని, బ్రిలియంట్ ఐడియా అని చెబుతున్నారు. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అని అంటున్నారు. మరి లోకా మూవీ తెలుగు ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News