సమంతపై అఖిల్ ప్రశంసలు.. మాజీ వదినను మరువని వైనం!
అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన కొత్త సినిమా 'లెనిన్' ప్రమోషన్స్‌లో భాగంగా మాజీ వదిన, స్టార్ హీరోయిన్ సమంతపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన కొత్త సినిమా 'లెనిన్' ప్రమోషన్స్‌లో భాగంగా మాజీ వదిన, స్టార్ హీరోయిన్ సమంతపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సమంత లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' ట్రైలర్ అదిరిపోయిందని, ఆమె యాక్టింగ్ సూపర్బ్ అంటూ అఖిల్ ఓపెన్‌గా ప్రశంసలు కురిపించాడు. ఒకప్పుడు ఒకే కుటుంబంలో భాగమైన అఖిల్, సమంత ఇప్పుడు తమ తమ జీవితాల్లో ముందుకు సాగుతున్నప్పటికీ.. ఒకరిపై ఒకరు గౌరవంతో మాట్లాడుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాజిటివ్ స్పందనలను చూసి అక్కినేని, సమంత అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్వ్యూలో హాట్ టాపిక్:
టాలీవుడ్‌లో సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్, ఈసారి ఎలాగైనా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని పక్కా ప్లాన్‌తో ఉన్నాడు. ఆయన నటించిన 'లెనిన్' సినిమా జూలై 10న రిలీజ్ కానుంది. ఇక ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న అఖిల్.. సమంత సినిమా ప్రస్తావన రాగానే ఎంతో హుందాగా స్పందించి అందరి మనసులు గెలుచుకున్నాడు.
సమంత యాక్టింగ్ సూపర్బ్:
సమంత మెయిన్ లీడ్‌లో నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా గురించి అఖిల్ మాట్లాడుతూ.. తాను ఈ సినిమాను ఇంకా చూడలేదని, కానీ మూవీపై చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చెప్పాడు. "‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ చూసాను, అందులో సమంత నటన చాలా ఇంప్రెస్ చేసింది.ఇక ట్రైలర్ చూడగానే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనిపించింది" అంటూ అఖిల్ మెచ్చుకున్నాడు.
ఫ్యాన్స్ దిల్ ఖుష్:
సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన అఖిల్.. సమంతకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఒకప్పుడు ఒకే ఫామిలీ పర్సన్స్ అయినా వీరు ఇద్దరు పరస్పరం గౌరవంతో మాట్లాడుకోవడం చూసి రెండు వైపుల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫుల్ హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారు.
మాస్ లుక్‌లో అఖిల్ 'లెనిన్':
ఇక జూలై 10న రాబోతున్న అఖిల్ 'లెనిన్' సినిమా విషయానికి వస్తే.. ఇది ప్యూర్ రాయలసీమ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఇందులో అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. 'వినరో భాగ్యం విష్ణు కథ' ఫేమ్ మురళీ కిషోర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక కింగ్ నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి ఈ సినిమాను భారీగా నిర్మించారు.
ఇలా ఒకవైపు మాజీ వదిన సమంత సినిమాకు హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ చెబుతూనే.. మరోవైపు తన 'లెనిన్' సినిమాతో థియేటర్లలో మాస్ జాతర చేయడానికి అఖిల్ రెడీ అయిపోయాడు. మరి ఈ జూలై 10న రాబోతున్న ఈ పల్లెటూరి యాక్షన్ డ్రామా అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందో లేదో చూడాలి.