నటవారసుడంటే పడి చస్తున్న లారిస్సా బోనెస్సి
కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన 'ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్' ప్రోమో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.;
కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన 'ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్' ప్రోమో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రోమోలో దర్శకుడిగా ఆర్యన్ ఖాన్ ప్రతిభను చూపాడని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసించాయి. ముఖ్యంగా టీజర్ విడుదలైన తర్వాత, కరణ్ జోహార్ - అనన్య పాండే సహా పలువురు సినీ ప్రముఖులు ఆర్యన్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. వెబ్ సిరీస్ రాక కోసం ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నామని ప్రకటించారు.
అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసల సంగతి అటుంచితే, ఆర్యన్ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి లారిస్సా బోనెస్సీ ప్రశంస గురించే ప్రపంచం ఎక్కువగా పట్టించుకుంటోంది. ఆర్యన్ విదేశీ బ్యూటీ లారిస్సాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు చాలా కాలంగా ఉన్నాయి. బ్రెజిలియన్ బ్యూటీ ఆర్యన్ తో సాన్నిహిత్యాన్ని ఎక్కువగా కోరుకుంటోంది. అందుకే ఇప్పుడు లారిస్సా పొగడ్త మీడియా హెడ్ లైన్స్ లోకి వచ్చింది.
ఇంతకీ లారిస్సా ఏమని పొగిడేసింది? అంటే... టీజర్ యూట్యూబ్ లో విడుదల కాగానే... ''అన్‌స్టాపబుల్.., సాటిలేనిది.. నిజంగా ప్రపంచంలో #1! గర్వించదగిన ప్రయత్నం.. తక్కువ అంచనాతో ఎక్కువగా రీచ్ అవుతుంది!'' అంటూ వ్యాఖ్యను జోడించింది. ఆర్యన్ విషయంలో లారిస్సా మరీ ఇంతగా ఎందుకు ఎమోషనల్ అవుతోంది? అనేది అందరిలో సందిగ్ధతను నింపుతోంది. అసలింతకీ ఆర్యన్ తో లారిస్సా బాండింగ్ ఎలాంటిది? అనేది స్పష్ఠం కావాల్సి ఉందని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.
లారిస్సా బోనెసి ఎవరు? అంటే.. ప్రముఖ నటి కం మోడల్. 1990 మార్చి 28న బ్రెజిల్‌లో జన్మించిన ఈ బ్యూటీ బాలీవుడ్, టాలీవుడ్ కి సుపరిచితురాలు. రాజ్ అండ్ డి.కె 2013 యాక్షన్ కామెడీ 'గో గోవా గాన్'లో కనిపించింది. టాలీవుడ్ లో సాయి ధరమ్ తేజ్ యాక్షన్-కామెడీ తిక్కలో కథానాయికగా ఆడిపాడింది. ఇవేగాక కొన్ని సౌత్ సినిమాల్లోను నటించింది. ఓలే, లాంకోమ్, లెవిస్ వంటి కొన్ని టాప్ బ్రాండ్స్ ప్రకటనల ప్రచారాలలో కూడా భాగమైంది.